డిసెంబ‌ర్ 19న తిరుపతిలో ‘మామ మంచు-అల్లుడు కంచు’ ఆడియో స‌క్సెస్ మీట్‌

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటించిన‌ చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటించారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించిన‌ ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కోటి, అచ్చు, ర‌ఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 28న విడుద‌ల చేశారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

23 ఏళ్ళ త‌ర్వాత మోహ‌న్‌బాబు, ర‌మ్య‌కృష్ణ‌, మీనా కాంబినేష‌న్‌తో పాటు ఈ యంగ్ జ‌న‌రేష‌న్ కామెడి స్టార్ హీరో న‌టించ‌డంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఆడియో స‌క్సెస్ అయిన సంద‌ర్బంగా డిసెంబ‌ర్ 19న తిరుప‌తి నెహ్రు మున్సిప‌ల్ గ్రౌండ్ లో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర కానున్నారు.
డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com