బీహార్‌కు లక్షా అరవైఐదువేలకోట్ల ప్యాకేజి: ఎన్నికలవేళ మోడి వల

హైదరాబాద్: అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి భారీ తాయిలం ప్రకటించారు. రు.1.25 లక్షలకోట్ల ప్రత్యేక ప్యాకేజిని, బీహార్ మౌలికవసతుల అభివృద్ధికి మరో రు.40 వేలకోట్లను మంజూరుచేస్తున్నట్లు ఇవాళ బీహార్‌లోని ఆరాలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఈ ప్యాకేజిని పూర్తిగా వినియోగించేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్యాకేజిలతో బీహార్ దశ తిరుగుతుందని అన్నారు. బీహార్‌కు యూపీఏ ప్రభుత్వం రు.12,000 కోట్లుమాత్రమే ఇచ్చిందని, దానిలో రు.4,000కోట్లు మాత్రమే వినియోగమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం బీహార్‌కు రెండు స్పెషల్ ప్యాకేజిలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాలను వినియోగించుకోలేకపోతోందని ఆరోపించారు. దేశంలో ఏదో ఒక భాగంమాత్రమే అభివృద్ధి చెందితే దేశం మొత్తం అభివృద్ధి చెందినట్లు కాదని తాను మొదటినుంచీ చెబుతున్నానని, ముఖ్యంగా తూర్పుభాగం అభివృద్ధి చెందాలని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.

విభజనవలన ఎంతో నష్టపోయామని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, రాజకీయ నాయకులు ఎంతగా వేడుకుంటున్నా ప్రత్యేకహోదాకానీ, ప్యాకేజిగానీ ప్రకటించని నరేంద్రమోడి ప్రభుత్వం, ఎన్నికలు జరగబోతున్న బీహార్‌కుమాత్రం భారీ ప్యాకేజి ప్రకటించటంలో వారి ఉద్దేశ్యం ఏమిటో చిన్నపిల్లలకుకూడా అర్థమవుతూనే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్‌కుకూడా ఏమైనా ఇస్తే గిస్తే ఎన్నికలముందు ఏమైనా విదిలిస్తారేమో! అప్పటిదాకా – హోదా వస్తూ…ఉంది అనే టీడీపీ, బీజేపీ నేతల స్టేట్‌మెంట్‌లు, కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ బంద్‌లు, పవన్ కళ్యాణ్ ట్వీట్‌లు భరించాల్సిందేనన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close