జగన్ చెప్పే చిలక జోస్యాల వలన ఎవరికి నష్టం?

రాజకీయ నాయకులు ఎవరయినా ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలలో కొనసాగుతున్నామని చెపుతుంటారు. కానీ అధికారం, పదవులు, సంపాదన ఈ మూడే వారి ప్రధాన లక్ష్యాలని వారే రుజువు చేసుకొంటుంటారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వనందుకు, మంత్రి పదవుల కోసం ఆశపడి పార్టీలు మారే నేతలను చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. కానీ అప్పుడు కూడా వారు తాము పదవులకోసమే పార్టీలు మారుతున్నామని చెప్పుకొనే సాహసం చేయరు. కార్యకర్తల ఒత్తిడి వలనో, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమో లేకపోతే ఎవరికీ కనబడని, ఆచరించని పార్టీ సిద్దాంతాలపట్ల ఆకర్షితులయ్యో పార్టీలు మారుతున్నామని చెప్పుకొంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు అవకాశం దొరికిన ప్రతీసారి తను ముఖ్యమంత్రి అవ్వాలనే తాపత్రయాన్ని నిర్భయంగా బయటపెట్టుకొంటారు.

తన తండ్రి చనిపోయిన వెంటనే ఎమ్మెల్యేల సంతకాల సేకరణతోనే ఆయన యావ బయటపడింది. నేటికీ ఆ యావ అలాగే ఉంది ఇంతకుముందు ఆయన సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్నపుడు “మరికొన్ని రోజుల్లో తను ముఖ్యమంత్రి కాబోతున్నానని, తను ముఖ్యమంత్రి అవగానే ప్రజల సమస్యలన్నీ తీర్చేస్తానని అంతవరకు ప్రజలు ఓపిక పట్టాలని” చెపుతుండేవారు. కానీ ఎన్నికలలో ఓడిపోయారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘ఫౌల్ గేమ్’ ఆడటం వలననే తను ముఖ్యమంత్రి పదవిని జస్ట్ మిస్ అయ్యానని తనని ఓదార్చుకొన్నారు. ఆ తరువాత నుండి మూడేళ్ళు…రెండేళ్లలో తెదేపా ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెపుతూ తను ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆయన యావ చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.

మళ్ళీ ఈ మధ్య బయటపడిన ఓటుకి నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లిపోవడం ఖాయమని, ప్రభుత్వం కూలిపోవడం తధ్యమన్నట్లు ఆయన, ఆయన మీడియా జనాన్ని ఊదరగొట్టారు. కానీ అటువంటిదేమీ జరగకపోవడంతో తన అత్యుత్సాహానికి నాలిక కరుచుకొని వెంటనే ‘ప్రత్యేక హోదా’కి షిఫ్ట్ అయిపోయారు. కానీ ఆలాగని జగన్మోహన్ రెడ్డి తన ‘సీయం డ్రీమ్స్’ కనడం మానేయలేదు. ఇంకా దానిలోనే కంటిన్యూ అయిపోతున్నారు. ఆయన నిన్న కడపలో మీడియాతో మాట్లాడుతూ మరో మూడేళ్ళలో తెదేపా ప్రభుత్వం పడిపోతుందని, అప్పుడు తనే ముఖ్యమంత్రి అయిపోతానని జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రి అవ్వాలనే ఆయన తపన చూసి ప్రజలు నవ్వుకోవచ్చును. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం కూలిపోతుందని పదేపదే చెప్పడం, తరువాత తనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకోవడం చూస్తే చాలా అనుమానాలకు తావిస్తోంది. ఓటుకి నోటు కేసులో అయన తెరాస నేతలతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేసారని తెదేపా నేతలు ఆరోపించినప్పుడు ఆయన వారికి సమాధానం చెప్పలేకపోయారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలలో పోటీపడి అధికారంలోకి రావాలనుకొంటున్నామని ఆయన చెప్పుకొంటే ఎవరూ ఆక్షేపించేవారు కాదు. కానీ త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని అప్పుడు తను ముఖ్యమంత్రి అవుతానని పదేపదే చెప్పుకొంటుంటే, అందుకోసం ప్రభుత్వాన్ని కూల్చడానికి మళ్ళీ ఏమయినా కుట్రలు పన్నుతున్నారా? అనే అనుమానాలు కలగడం సహజం.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడయి ఉండి జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా జోస్యాలు చెప్పడం, ముఖ్యమంత్రినవుతానని చెప్పుకోవడం, ప్రజలకు ఆయన పట్ల అనుమానాలు, చులకన భావం ఏర్పడేలా చేయడమే కాదు ఆయన రాజకీయ అపరిపక్వతకి అద్దం పడుతున్నాయి. ఆయన మాటల వలన ఆయనకే కాదు వైకాపాకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close