ఒక్క నిర్ణయంతో వెయ్యి కోట్లు !

విద్యుత్తు రంగంలో విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీకి పేరు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా విద్యుత్ రంగంపై దృష్టి పెట్టారు. ఆయన ఎంతో చొరవగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా మన దేశంలో ప్రతి ఏటా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. వెలుగుకు వెలుగు, ఆదాకు ఆదా అన్న మాట.

పాతకాలపు బల్బులు, ట్యూట్ లైట్ల స్థానంలో అత్యాధునిక ఎల్. ఇ.డి. లైట్లను పంపిణీ చేపట్టారు. గురువారం సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా సరఫరా చేసిన ఎల్ ఇ డి లైట్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. ఈ బల్బులు తక్కువ కరెంటును వినియోగిస్తూ ధారాళంగా వెలుగునిస్తాయి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. ప్రభుత్వ లెక్కవ ప్రకారం, 73 లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుంది. అంటే రోజుకు దాదాపు 2 కోట్ల 90 లక్షల రూపాయల మేర ఆదా అవుతుందట.
2018 నాటికి దేశ వ్యాప్తంగా 77కోట్ల ఎల్ ఇ డి బల్సులు ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

విద్యుత్ ఆదా చేసే ఎల్ ఇ డి బల్బుల వినియోగంలో ఏపీ అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 65.2 లక్షల ఎల్ ఇ డి బల్బుల ఏర్పాటు జరిగింది. ఈ బల్బుల వల్ల మరో లాభం కూడా ఉంది. పాతకాలపు బల్బులతో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ ను తక్కువగా విడుదల చేస్తాయి. ఇప్పటి వరకు బిగించిన ఎల్ ఇ డి లైట్ల వల్ల రోజుకు 12 వేల టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గిందని అంచనా. అంటే పర్యావరణానికి కూడా మేలే. మనకు కూడా కరెంటు బిల్లు ఆదా అవుతుంది. ఇప్పుడు కడుతున్న దాంట్లో చాలా తక్కువ బిల్లు కడితే సరిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close