సోనియా అయినా మోడీ అయినా ఏపీకి ఎప్పుడూ మొండి చెయ్యే!

చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టక ముందు నుండి కూడా నిధుల కోసం, పెండింగ్ ప్రాజెక్టుల కోసం, ప్రత్యేక హోదా కోసం మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్రం ఎప్పుడు ఏదో అరకొరగా విదిలిస్తోందే తప్ప ఏనాడు రాష్ట్ర దుస్థితి, సమస్యలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉదారంగా ఆర్ధిక సహాయం చేసిన దాఖలాలు లేవు. హూద్ హూద్ తుఫాను సహాయ, పునరావాస చర్యల కోసం మోడీ స్వయంగా ప్రకటించిన వెయ్యి కోట్ల కోసం చంద్రబాబు నాయుడు కేంద్రం చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరగవలసి వచ్చింది.

ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నిధులు మంజూరు చేస్తామని చెపుతున్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, అందుకోసం రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాకు కలిపి రూ.350 కోట్లు అంటే జిల్లాకి రూ. 50 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపు కొన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన ఆగ్రహం దాచుకోలేకపోయారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని పూర్తి చేసే మాదేనని చెప్పుకొంటున్న కేంద్రప్రభుత్వం దానికి కేటాయించిన మొత్తం కేవలం రూ.250 కోట్లు మాత్రమేనని చంద్రబాబు స్వయంగా నిన్న ప్రకటించారు. వేలకోట్లు పోసినా పూర్తిచేయలేని ప్రాజెక్టుకి రూ. 250 కోట్లు మంజూరు చేస్తే అదెప్పుడు పూర్తవుతుంది? ఆ మొత్తం ప్రాజెక్టు పనులు జరగడానికా లేక కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచడానికా? అనే అనుమానం కలుగుతోంది.

గతపదేళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థలని పూర్తిగా చిన్నా భిన్నం చేసి వెళ్లి పోయిందని దానిని ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ చక్కదిద్ది దారిన పెడుతున్నారని, అందుకే నిధుల విడుదలలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నిన్న అన్నారు. కేంద్రప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పుడు మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏ సమస్యలు లేని బీహార్ రాష్ట్రానికి ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి, దానితో బాటే రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో రూ.40, 000 కోట్లు ఏవిధంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు? ఏ సమస్యలు లేని బీహార్ కి ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు ఇవ్వగలుగుతున్నప్పుడు రాష్ట్ర విభజనతో పూర్తిగా చితికిపోయున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అరకొర నిధులు ఎందుకు విదిలిస్తున్నారు? ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర పరిస్థితుల గురించి వివరిస్తున్నా కేంద్రప్రభుత్వం ఎందుకు కనికరించడం లేదు? మోడీ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు పలుకుతున్న తెలుగు ప్రజల పట్ల ఇంత అలుసు, చిన్న చూపు ఎందుకు? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలలాగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రజలు ముఖ్యంగా ఆంధ్రా ఎంపీలు, ప్రజలు గట్టిగా నోరువిప్పి మాట్లాడలేరనే దైర్యంతోనే మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజల పట్ల ఇంత అలుసుగా వ్యవహరిస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికయినా మోడీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగు ప్రజల పట్ల తన వైఖరిని మార్చుకోవడం మంచిది. లేకుంటే తెలుగు ప్రజలు ఎలాగు నష్టపోతారు. వారితో బాటు బీజేపీ కూడా అందుకు మూల్యం చెల్లించక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి రికార్డ్ ధర పలికిన బాలాపూర్ గణనాథుడి లడ్డూ

బాలాపూర్ గణనాథుడి లడ్డూ మరోసారి రికార్డ్ ధర పలికింది. నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఉదయం లడ్డూ వేలం నిర్వహించగా..గతేడాది కన్నా మూడు లక్షలు అదనంగా పలికింది. ఈ ఏడాది 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు...

ఖైరతాబాద్ మహా గణపతికి వీడ్కోలు.. ట్యాంక్ బండ్ వద్ద ఇదీ పరిస్థితి!

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని...

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close