లాక్‌డౌన్ ఎత్తివేత ఒకే సారి కాదు.. విడతల వారీగా..!?

లాక్ డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం… ఆలోచనలు ప్రారంభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ఈ మేరకు సూచనలు చేశారు. ఒకే సారి లాక్‌డౌన్ ఎత్తివేస్తే..అందరూ ఒకే సారి రోడ్ల మీదకు వస్తారని.. దీని వల్ల మళ్లీ సమస్య మొదటికి వస్తుందన్న అభిప్రాయాన్ని సమావేశంలో నరేంద్రమోడీ వ్యక్తం చేశారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రులకు గుర్తు చేశారు. అంటే.. ప్రధానమంత్రి లాక్‌డౌన్ ఎత్తివేత దిశగా చర్యలు తీసుకుంటున్నారన్న విషయం స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశంలో ఇప్పుడు బయటపడుతున్న పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లిన వారివి.. వారి నుంచి ఇతరులకు కాంటాక్ట్ ద్వారా పాజిటివ్‌గా తేలిన కేసులే. విదేశాల నుంచి వచ్చిన క్వారంటైన్ ఈ నెల ఏడో తేదీతో పూర్తవుతుంది. వారిలో వైరస్ లక్షణాలు ఏమైనా ఉంటే.. ఆ పాటికి బయటపడుతుంది. లేకపోతే.. వైరస్ లేనట్లే. ఇప్పటికే తబ్లిగీ జమాతే లో ప్రార్థనలకు వెళ్లిన వారందర్నీ దాదాపుగా … అన్ని రాష్ట్రాల్లోనూ ట్రేస్ చేసిన అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వీలైనన్ని ఎక్కువగా పరీక్షలు నిర్వహించి.. ఐసోలేషన్‌కో.. క్వారంటైన్‌కో తరలిస్తున్నారు. వీరు కూడా.. ఢిల్లీకి వెళ్లి వచ్చి పధ్నాలుగు రోజులు పూర్తయింది. ఎలా చూసినా.. వచ్చే ఐదు రోజుల్లో బయటపడే పాజిటివ్ కేసులే తప్ప.. కొత్తగా రావన్న అంచనా ఆరోగ్య నిపుణుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. శుక్రవారం ఉదయం… ప్రజలకు వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన వీడియో సందేశం ఎయిర్ అవుతుంది. అందులో.. ప్రస్తుతం దేశంలో కరోనా ఉన్న పరిస్థితి.. ప్రజలు మరికొద్ది రోజుల పాటు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించే అవకాశం ఉంది. అలాగే.. లాక్ డౌన్‌ను సడలించి.. దేశంలో మళ్లీ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా.. వెసులుబాట్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close