బ‌న్నీ కోసం రెండ‌క్ష‌రాల టైటిల్‌

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం బ‌న్నీ త‌న వేషం, భాష మార్చుకోవాల్సి వ‌చ్చింది. గుబురు గ‌డ్డం, ఒత్తైన జుత్తుతో ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు. ఈపాటికే పావు వంతు షూటింగ్ జ‌ర‌గాల్సింది. కానీ.. చాలా కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్య‌మైంది. దానికి తోడు లాక్ డౌన్‌. ఈ చిత్రానికి సింహాచ‌లం అనే పేరు పెట్టార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. వాటిని చిత్ర‌బృందం ఖండించింది కూడా. ఇప్పుడు ఈ సినిమాకి స‌రికొత్త టైటిల్ రెడీ అయిపోయింది.

బ‌న్నీ – సుక్కు కాంబినేష‌న్‌లో `ఆర్య‌`, `ఆర్య 2` వ‌చ్చింది. ఇప్పుడు కూడా రెండ‌క్ష‌రాల టైటిల్ నే ఖ‌రారు చేశార్ట‌. ఓ అమ్మాయి పేరుని ధ్వ‌నించేలా ఆ టైటిల్ ఉంటుంద‌ని టాక్‌. టైటిల్ లోగో కూడా సిద్ధ‌మైపోయింది. ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ టైటిల్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రి ఆ రెండ‌క్ష‌రాల టైటిల్ ఏమిటో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close