తెలుగు360 ఎడిటర్స్ కామెంట్ : జరుగుతోంది మూడో ప్రపంచయుద్ధమే..!

“మానవాళికి భూమ్మీద ఇంకా నూకలున్నాయా..?”.. అన్నంత అనుమానం కలిగేలా.. ప్రపంచం అంతా వణికిపోతోంది. ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయిందని.. సరిహద్దులు చెరిగిపోయాయని.. తాము కనిపెట్టిన టెక్నాలజీ.. సాధించిన అభివృద్ధిని చూసి.. చాలా మంది కాలర్లు ఎగరేశారు. ఇప్పుడేమయింది. ఓ దేశం నుంచి మరో దేశానికి కాదు.. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లడానికి కూడా అవకాశం దొరకడం లేదు. పోలీసులు అడ్డుకోవడం కాదు.. అసలు ఆయా గ్రామాల వాళ్లే.. ఇతరుల్ని రానివ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా.. నెలా…రెండు నెలల్లో వచ్చిన మార్పు. మానవాళి తన జీవన విధానంలో చేసిన తప్పులను.. తెలుసుకునేలా చేసేందుకు వచ్చిన విపత్తు.

కనిపించని శత్రువుపై పోరాడుతున్న ప్రపంచం..!

మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. అది దేశాల మధ్య రాదని.. ఖచ్చితంగా.. ఏలియన్స్‌తోనో.. మరో ఊహాతీతమైన శత్రువుతోనే పోరడాల్సి వస్తుందని… హాలీవుడ్ సినిమాల్లో.. వెబ్ సిరీస్‌లలో ఇప్పటికే చూపారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధమే నడుస్తోంది. ఈ ఊహాతీత శత్రువు. కోవిడ్ -19 వైరస్. శతాబ్దాల చరిత్ర ఉన్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ.. ఇప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే వాయిదా పడింది. ఒకటో సారి.. మొదటి ప్రపంచయుద్ధం జరిగినప్పుడు.. రెండో సారి.. రెండో సారి ప్రపంచయుద్దం జరిగినప్పుడు. ఇప్పుడు మూడో సారి వాయిదా పడింది. అప్పుడు దేశాల మధ్య అఫీషియల్‌గా.. యుద్ధం డిక్లేర్ కాలేదు. కానీ.. మూడో ప్రపంచ యుద్ధంతోనే అందరూ పోలుస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ.. తమపై దాడి చేస్తున్న కోవిడ్ -19 వైరస్‌ను అంతమొందించడానికి.. ప్రజల్ని కాపాడుకోవడానికి.. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. యుద్ధాలంటూ వస్తే.. తమదే పైచేయి కావాలని… అన్ని దేశాలు సంపాదించి పెట్టుకున్న అణ్వస్త్రాలు సహా… ఎలాంటి ఆయుధమూ.. ఈ యుద్ధంలో ఉపయోగించడానికి లేదు.. ఉపయోగించలేరు కూడా. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచ పాలకులెవరూ .. తమకు ఎదురవ్వబోయే ముప్పు.. ఇతర దేశాల నుంచి కాదని.. వేరే రూపంలో ఉంటుందని.. ఊహించలేకపోయారు. నిఖార్సైన ముందు చూపు ఉన్న నేత ఒక్కరు కూడా ప్రపంచంలో లేరని.. నిరూపించేశారు.

అభివృద్ధి పేరుతో మానవాళి చేసిన విధ్వసంపై ప్రకృతి ప్రతీకారం..!

మనిషి ప్రపంచాన్ని జయించానని కాలరెగరేశాడు. కానీ కనిపించని క్రిమి చేతిలోచావుదెబ్బ తింటున్నాడు. సంపాదించిన విజ్ఞానంమే కాదు.. కూడబెట్టుకున్న లక్షల కోట్లు కూడా కాపడలేకపోతున్నాయి. ఇది ఒక్కరి బాధ కాదు..ఒక ప్రాంతం.. ఒక దేశం బాధ కాదు. ప్రపంచం మొత్తం బాధ. గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని కుగ్రామం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా.. అందరూ కలిసి పోరాడాల్సిందే. నేనే గొప్ప అనుకుంటూ ఆర్థిక సౌధాల్ని నిర్మించుకున్న మనిషికి.. ఇప్పుడు తాను ఎంత విలువలేని వాటిని పోగేసుకున్నాడో అర్థం అవుతోంది. కరోనా దెబ్బకు మొత్తం ఎక్కడిదక్క స్తంభించిపోయింది. వ్యాపారాలు లేక‌పోతే జీఎస్టీ ఆదాయం రాదు. డ‌బ్బులు లేక‌పోతే ప్రభుత్వాలు న‌డ‌వ‌వు. త‌నంత‌టి వాడు లేడు అనుకున్నప్పుడు, మ‌నిషికి తానేంటో ప్రకృతి చూపిస్తూ ఉంటుంది. మ‌నం బాగుండాలి, కానీ మ‌నం మాత్రమే బాగుండాలి అంటే ప్రకృతి ఒప్పుకోదు. ఈ భూమి అంద‌రిదీ. దీన్ని ఇప్పటి వరకూ తెలుసుకోని అసలు ఫూల్.. మనిషి. దీన్ని కోవిడ్ -19 వైరస్ .. నిరూపిస్తోంది..

విధ్వంసాలతో కూడబెట్టిన లక్షల ..లక్షల కోట్లు నాశనం..! చివరకు మిగిలేదేంటి..?

కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దివాలా దిశగా తీసుకెళ్తోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేదు.. నష్టపోని వారంటూ లేరు. ఆన్‌స్లాట్‌ ప్రతి కంపెనీ నెట్‌ వాల్యూ ఎక్కడకు పడిందో చెప్పడం కష్టంగా మారింది. మన దేశంలో రిలయన్స్ దగ్గర్నుంచి చైనా అలీ బాబా వరకూ అందరూ దెబ్బతిన్నారు. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ దగ్గర్నుంచి అనకాపల్లి బెల్లం వ్యాపారి వరకూ.. అందరూ నష్టపోయారు. మహామహా వ్యాపార సామ్రాజ్యాలనే కుప్పకూల్చేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పరిస్థితి మరింత తీవ్రతరమవుతోంది. కొన్ని మినహా.. మెజార్టీ దేశాల్లో పరిశ్రమలు మూతపడ్డాయి. ఎయిర్ లైన్స్ నిలిచి ప్రయాణాలు ఆగిపోయాయి. పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోతున్నాయి. వీటి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది. అంతర్జాతీయ ఏజెన్సీ అయిన ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ .. కరోనా వైరస్ వల్ల… దశాబ్దం కిందట అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు పూర్తిగా.. ఏ దేశంలోనూ ఉత్పాదక కార్యక్రమాల్లేవు. ఈ వైరస్ ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. అసలు తగ్గే పొజిషన్‌లో కూడా లేదు. ఏ స్థాయిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఆయా దేశాలను పరిపాలిస్తున్న పాలకులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ప్రపంచ పెద్దన్న ఎన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసినా గత వైభవం తెచ్చుకోగలదా..?

అమెరికా అనే పేరులో ఓ వైబ్రేషన్ ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా ఈ దేశమే డెస్టినేషన్. ప్రజల లైఫ్ స్టైల్.. అమెరికా విలాసానికి సింబల్‌గా ఉంటుంది. అంతులేని సంపద అమెరికా సొంతం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అమెరికా డాలర్ చెల్లుబాటవుతుంది. మరే దేశానికి ఆ అవకాశం లేదు. అందరూ అమెరికా డాలర్లే కొనుక్కోవాలి. ఇప్పుడు ఆ అమెరికా .. కోవిడ్ -19 కోరల్లో చిక్కి.. ఆస్పత్రి పాలవుతోంది. ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు 150 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి 1200 డాలర్లు అందే ఏర్పాట్లు చేశారు. అయితే.. కరోనా కంట్రోల్ కాకుండా.. ఈ ప్యాకేజీలేవీ అమెరికాను గట్టెక్కించే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు అమెరికాలో కరోనా కంట్రోల్ అవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టంగా మారింది. నిరుద్యోగం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. యూరోప్ పరిస్థితి సంక్షుభిత దేశాలకు దగ్గరగా ఉంది.

కరోనా ఫ్రీ చేస్తే సరిపోదు.. అది కూల్చివేసిన సౌధాల్ని నిర్మించాలి..!

కొన్ని లక్షల మందిని బలి తీసుకున్న తర్వాత.. కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కొన్ని లక్షల లక్షల కోట్లు సంపదను ఆవిరి చేసిన తర్వాత కరోనా అంతమవ్వొచ్చు లేదా.. దాన్ని శరీరంలోకి రాకుండా.. వ్యాక్సిన్‌ను కనిపెట్టొచ్చు. అంత మాత్రాన ప్రపంచం … కోవిడ్ -19పై విజయం సాధించినట్లా.. అంటే.. కానే కాదు. వైరస్ అంతమవ్వొచ్చు కానీ..అది సృష్టించిన విధ్వంసం ప్రపంచాన్ని పీడకలలా వెంటాడుతూనే ఉంది. సైడ్ ఎఫెక్టులు.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని మరో పదేళ్లు పాటు వెంటాడినా ఆశ్చర్యపోనవసరం లేదు. సూపర్ పవర్ దేశాలను బికారిగా మార్చేసినా.. విశేషం లేదు. ప్రపంచ పాలకులందరూ.. తామే మేధావులం అనకున్నారు. కానీ.. వారందర్నీతో ఆడుకుంది.. కనిపించని క్రిమి. ఇప్పుడు ఆ పాలకులు మళ్లీ తమ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ -19ను నామరూపాల్లేకుండా చేయడమే కాదు.. అది కూల్చిన ప్రపంచ ఆర్థిక సౌధాల్ని పునర్మించాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేకపోతే… ప్రపంచం ఆర్థికంగా రెండు దశాబ్దాలు వెనక్కి పోయినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close