వ్యాపారానికి వైరస్ : రీటైల్ ఇండస్ట్రీ కోలుకుంటుందా..? కుప్పకూలుతుందా..?

కోవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం కాని పరిశ్రమ, ఇండస్ట్రీ, సేవల రంగం లేదు. ప్రతి ఒక్క దానిపైనా దెబ్బపడింది. కొన్నింటిపై చావు దెబ్బ పడితే.. మరికొన్నింటిపై ప్రభావం తక్కువ ఉంది. ప్రత్యక్ష ప్రభావం లేకపోయినా.. పరోక్ష ప్రభావం తీవ్రంగా ఉండే రంగాల్లో ఒకటి రీటైల్ రంగం. ఆన్ లైన్ బిజినెస్ విశ్వరూపం కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రీటైల్ రంగానికి.. కోవిడ్ -19 మరో గడ్డు పరిస్థితిని తెచ్చి పెట్టింది.

రిటైల్ ఇండస్ట్రీని గట్టి దెబ్బకొట్టిన కోవిడ్ -19..!

కోవిడ్ -19కి దొరకకుండా ఉండాలంటే.. ప్రజలందరూ ఇళ్లలోనే దాక్కోవాలని ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అనేక ఆంక్షలు పెట్టింది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ తప్ప..మార్కెట్లో ఇంకెమీ దొరకడం లేదు. అన్ని రకాల షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాలు మూతపడ్డాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. లాక్ డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియదు. కేంద్రం ప్రకటించినట్లుగా… ఈ నెల 14వ తేదీ వరకే ఉన్నా.. అది రీటైల్ ఇండస్ట్రీపై చావుదెబ్బే. పరిస్థితులు ఇలానే కొనసాగితే లక్షల మంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. కొవిడ్ -19 భయం ప్రజలను.. ప్రభుత్వాలను ఇప్పుడల్లా వదిలి పెట్టదు. కోవిడ్ కారణంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలనే ప్రభుత్వాలు సూచిస్తాయి.

లాక్ డౌన్ ఎత్తేసినా షాపింగ్‌లకు ప్రజల వద్ద డబ్బులుండవ్..!

లాక్ డౌన్ ఎత్తివేసినా… కొన్ని ఆంక్షలు మాత్రం కొనసాగే ‌అవకాశం ఉంది. సామూహికంగా గుమికూడటంతో పాటు.. వివిధ రకాల ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఒక వేళ పెట్టకపోయినా ప్రజలు రీటైల్ షాపింగ్ కోసం..మాల్స్ తో పాటు.. దుకాణాలు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. వారి ప్రాణభయం వారి. నాలుగైదు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రతి మూడు ఔట్‌లెట్స్‌లో ఒకటి మూతపడుతుందని రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. 30 శాతం రిటైల్ స్టోర్లు మూసివేతకు గురవుతాయి. ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చుల విషయంలో… ముందూ వెనుకా చూసుకుంటారు కాబట్టి… కోవిడ్ -19 ప్రభావం తగ్గిన తర్వాత దుకాణాలు వెలవెలబోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో కరెక్షన్ వచ్చి సగానికి సగం ఉద్యోగాలు లాస్ అయినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వమే బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాల్సి ఉంటుంది.

సగానికి తగ్గనున్న వ్యాపారం.. సగం ఉద్యోగాలు లాస్..!?

భారత్‌లో ప్రతి చిన్న సందులోనూ రీటైల్ దుకాణం ఉంటుంది. అయితే.. అవన్నీ అసంఘటిత రంగంలో ఉన్నట్లే. కానీ బ్రాండెడ్ రీటైల్ దుకాణాలు మాత్రం.. వాటికి బిన్నం. ప్రస్తుతం.. ఇలా భార‌త్‌లో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా.. రూ.4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కరోనా కారణంగా… ఫిబ్రవరి చివరి నాటికి వ్యాపారం 20 నుంచి 25 శాతం మేర తగ్గింది. దుస్తులు, ఆభరణాలు, బూట్లు, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్యూరబుల్స్ వంటి పలు ప్రొడక్టుల అమ్మకాలపై ప్రభావం పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close