జగన్ పిలిచినా ప్రధాని రావట్లే..!?

రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలంటూ.. జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు. అయితే.. మోడీ రావడం లేదని.. అంతకు ముందే ఏపీ సీఎంకు స్పష్టమైన సూచనలు అందాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ఓ నివేదికను.. పార్టీ హైకమాండ్‌ కు అందజేశారు. మూడురోజుల కిందటే ఢిల్లీ వెళ్లిన కన్నా లక్ష్మినారాయణ… కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రైతు భరోసా పథకం ప్రవేశ పెడుతున్నారని.. కానీ… జగన్ సర్కార్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటోందని.. లెక్కలతో సహా వివరించినట్లుగా తెలుస్తోంది.

రూ. 12,500ను రైతు భరోసా పథకం కింద రైతులకు ఇస్తామని.. జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. ఆ రూ. 12,500లో కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు ఉంటాయని చెప్పారు. కేంద్రం ఇప్పటికే కిసాన్ యోజన అనే పథకాన్ని ప్రవేశ పెట్టి.. రైతులకు మూడు విడతలుగా రూ. ఆరు వేలు ఇస్తోంది. ఎన్నికలకు ముందు నుంచి నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పుడు.. వాటిని తమ రైతు భరోసా పథకానికి అనుసంధానం చేసి.. తామే ఇస్తున్నట్లుగా జగన్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది.. బీజేపీ నేత వాదన. కన్నా లక్ష్మినారాయణ కొద్ది రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాలు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాన్ని పెడుతూ.. వైఎస్ఆర్ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై.. ఏపీ సర్కార్ స్పందించలేదు.

ఇదే విషయాన్ని కన్నా… బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు.. ఓ నివేదిక ఇచ్చారు. జగన్ సమావేశం కావడానికి ముందే నడ్డా… ఏపీలో రాజకీయ పరిస్థితులు… అక్కడి ప్రభుత్వ పనితీరుపై ఓ నివేదికను.. ప్రధానికి ఇచ్చి వచ్చారు. ఆ నివేదిక కన్నా లక్ష్మినారాయణ ఇచ్చిందే. అయితే..మోడీని ఏపీకి రావొద్దని కన్నా.. ఎక్కడా చెప్పలేదు. రైతు భరోసా పథకం .. గురించి మొత్తం వివరించి.. ఆలోచించి .. అన్నీ వివరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకారం.. మోడీ ఏపీ పర్యటన ఖరారయ్యే అవకాశం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close