కేసీఆర్‌ను పట్టించుకోని మోదీ – వ్యూహాత్మకమే !

ప్రధాని మోదీ నన్ను రేపు చీల్చి చెండాడుతాడు అని కేసీఆర్ ఆవేశంగా ఒక రోజు ముందే ప్రకటించుకున్నారు. కానీ మోదీ ఆయనను అంత సీరియస్‌గా తీసుకోలేదు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. అయితే ఆయన నోటి వెంట కేసీఆర్ అనే మాటే రాలేదు. ఇంకా చెప్పాలంటే అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించలేదు. కేసీఆర్ పాలన తీరు దారుణంగా ఉందనో.. వారసత్వ రాజకీాయల్ని ప్రోత్సహిస్తున్నారో విమర్శించలేదు.

అయితే కేంద్రం చేసిన సాయాన్ని… తెలంగాణ ప్రజలకు అందుతున్న పథకాల గురించి మాత్రం వివరించారు. తెలంగామకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. మోదీ ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం.. విమర్శలు లేకపోవడంతో ఫ్లాట్‌గా ముగిసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే దేశ్ కీ నేతగా రూ. వందల కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్‌కు వ్యూహాత్మకంగా కావాలనే మోదీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో బీజేపీని ఎంత రెచ్చగొట్టినా.. మోదీ పట్టించుకోలేదు. పోటీగా పోస్టర్లు.. ప్రచారం దక్కకుండా వ్యూహాలు.. బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి వ్యూహాలను అమలు చేసినా మోదీ.. కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు. ఆయనకు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతో మోదీ లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మోదీ ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో ముందుగా టీఆర్ఎస్ నేతలే నిరాశకు గురయ్యారు. తమను బీజేపీ ప్రత్యర్థిగా గుర్తిస్తే.. దేశవ్యాప్తంగా బీజేపీకి తామే పోటీ అన్నట్లుగా రేస్‌లోకి వస్తామని అనుకున్నారు. కానీ అసలు పట్టించుకోకపోవడంతో వారి కోరిక తీరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close