జనవాణి : ప్రభుత్వ బాధితుల్ని ఒకే వేదికపైకి తెచ్చిన పవన్ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు తొలి సారి ప్రారంభించిన జనవాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వ్యూహాత్మకంగా తొలి జనవాణిలో ప్రభుత్వం కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్ని వర్గాలను వేదికపై తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. వికలాంగులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం కలగకపోతే.. గతంలో వచ్చిన అనేక సబ్సిడీలు కూడా నిలిచిపోయాయి. అదే సమయంలో వికలాంగుల కార్పొరే్షన్‌కు కూడా నిధులు రావడం లేదు. ఈ పరిస్థితుల్ని పలువురు వికలాంగులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. వేదికపై రాలేని వారి దగ్గరకు స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లి ఆర్జీలు తీసుకున్నారు.

ఇక వైసీపీ పాలనలో పూర్తిగా దెబ్బతిన్న మరో వర్గం మైనార్టీలు. వారి సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రతినిధులకు పవన్ సమయం ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని.. జనసేన ఓటు బ్యాంక్‌గా చూడదని హామీ ఇచ్చారు. ఇలాగే దళితులు.. ఇతర వర్గాలు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. వీరందరికీ పవన్ కల్యాణ్ తగిన ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని వర్గాల సమస్యలను తెరపైకి తీసుకురావడంలో పవన్ కల్యాణ్ జనవాణి సక్సెస్ అయిందని అనుకోవచ్చు.

తొలి ఆర్జీని వ్యూహాత్మకంగా తాడేపల్లిలో సీఎం ఇంటి భద్రత పేరుతో తొలగించిన ఇళ్లల్లో నివాసం ఉండే వాలంటీర్ నుంచి తీసుకున్నారు. తర్వాత ఆమె కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పట్లో ఈ అంశం సంచలనం సృష్టించింది. ఆమె నుంచి తొలి ఆర్జీ తీసుకున్న పవన్ కల్యాణ్.. కార్యక్రమం మొత్తం ప్రభుత్వ బాధితులే ఉండేలా చూసుకున్నారు. 427 అర్జీలను పవన్ కళ్యాణ్ స్వీకరించారని జనసేన ప్రకటిచింది. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఈ‌ వేదిక ద్వారా లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అధికారంతో పని లేకుండా ప్రజల సమస్యలు పరిష్కారానికి జనసేన ఎప్పుడూ ముందు ఉంటుందనే సందేశాన్ని పంపామని జనసేన ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close