మోడీ నేతృత్వంలోని ఆ కమిటీలో జగన్‌తో పాటు చంద్రబాబు కూడా..!

ఏపీ సీఎం జగన్ మరో ఇద్దరో.. ముగ్గురో టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు.. ప్రధాని మోడీ ప్రత్యేక గౌరవం ఇచ్చారు. భారత్ వచ్చే ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణను ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారు. అందు కోసం కమిటీని నియమించారు. ఆ కమిటీలో సహజంగానే ముఖ్యమంత్రులకు చోటు లభించింది. , త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులకు హోదాల ప్రకారం చాన్స్ కల్పించారు.

వారితో పాటు మరికొంత మంది ప్రముఖులకు చోటు కల్పించారు. వారిలో చంద్రబాబు, రామోజీరావు, భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా కూడా ఉన్నారు. అలాగే క్రీడా రంగం నుంచి పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, మిథాలీరాజ్‌లకు స్థానం దక్కింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీ తొలి సమావేశం ఎనిమిదో తేదీన జరగనుంది. రాజకీయ పరంగా విబేధిస్తున్న చంద్రబాబును.. మోడీ చాలా కాలంగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

కరోనా కాలంలో ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఫోన్ చేశారు కానీ చంద్రబాబును లైట్ తీసుకున్నారు. అయితే.. చంద్రబాబు తానే పీఎంవోకు ఫోన్ చేసి మాట్లాడి తన ఆలోచనలను నివేదిక రూపంలో పంపించారు. ఆ తర్వాత కూడా.. చంద్రబాబు విషయంలో మోడీ సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు రాలేదు. ఇప్పుడు.. స్వాతంత్ర్య దినోత్సవ కమిటీలో చోటు కల్పించారు. పధ్నాలుగేళ్లు సీఎంగా చేయడం.. సుదీర్ఘ కాలం కీలక పాత్ర పోషించిన కారణంగా చంద్రబాబుకు చాన్సిచ్చారని అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెప్టెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిద్దూ.. ఇక కిరీటమే..!

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయం దెబ్బకు తట్టుకోలేక అవమానాలు భరించలేక ఆయన పదవీ త్యాగం చేసేశారు. ఇప్పుడు సిద్ధూకు ముఖ్యమంత్రి...

తరుణ్, పూరిల శాంపిల్స్‌లో డ్రగ్స్ లేవట..! అందరివీ లేనట్లేగా ?

నాలుగేళ్ల కిందట తీసుకున్న శాంపిల్స్‌ టెస్టుల ఫలితాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కోర్టుకు సమర్పించింది. తరుణ్ , పూరి జగన్నాథ్‌ల నుంచి సేకరించిన గోళ్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్‌లోని 2017లోనే ఎఫ్ఎస్ఎల్‌...

తృణమూల్‌లోకి బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కూడా జంప్!

బెంగాల్ బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు వలస వచ్చిన నేతలంతా వరుస కట్టి బయటకు పోతూంటే... ముందు నుంచీ ఉన్న నేతలు కూడా.. అదే బాట పడుతున్నారు....

డ్రగ్స్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్ !

రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేసే చేశారు కానీ...

HOT NEWS

[X] Close
[X] Close