మోడీ భార్యకు హక్కులుండవా?

ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌ ముంబాయిలో గుడిసెల తొలగింపుకు వ్యతిరేకంగా పేదలు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు. గుడ్‌సమరిటన్‌ మిషన్‌(జిఎస్‌హెచ్‌) అనే క్రైస్తవ సేవాసంస్థ ఎస్‌.పిటర్‌ రాజ్‌పాల్‌ నాయకత్వంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.మహిళల క్రియాశీలత కోరేవారెవరైనా బలపర్చాలి.కాని కొన్ని మీడియా సంస్థలు ఆమె స్పష్టత లేకుండా మాట్లాడారని వంకలు పెట్టడం విచిత్రం! మహానాయకులే మీడియా ముందు అనేక సార్లు తెల్లమొహం పెడుతుంటారు గాని ఈ వృద్ధ మహిళ తమ ప్రశ్నలకు ఠంచనుగా సమాధానం చెప్పకపోవడం వాటికి పెద్ద లోపంగా కనిపించింది. పేదలకు మేలు జరుగుతుందని తాను వచ్చానని యశోదాబెన్‌ చెప్పారు. తాను 2014లో 2015లో ముంబాయి వచ్చినప్పుడు ఈ సేవాసంస్థను సందర్శించి వారి కార్యక్రమాలు మంచివని తెలుసుకున్నానన్నారు. రేపో మాపో తాము తమ వూరు మేషనీ వెళ్లిపోతామని ఆమె ఆమె సోదరుడు అశోక్‌ కూడా చెప్పారు. ఇంతకంటే స్పష్టత ఏముంటుంది?
వ్యక్తిగత కారణాలతో ప్రధాని మోడీ ఆమెను దూరం పెట్టినంత మాత్రాన తన ఇష్ట ప్రకారం జీవించే హక్కు సమాచారం తెలుసుకునే హక్కు ఆమెకు వుండవా అనేది మహిళా నేతలు నిలదీస్తున్నారు. ఈ విషయాలు అడిగితే వ్యక్తిగతం అనొచ్చు కాని ఇక్కడ స్త్రీల అస్తిత్వ సమస్య వుంది. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అంటూనే కుటుంబంలోనూ సమాజంలోనూ వారిని చిన్నచూపు చేసే దేశం మనది. అందుకు గృహహింస చట్టంతో సహా చాలా వచ్చాయి. మోడీ తన భార్య వద్దనుకుంటే విడాకులు ఇచ్చి వుండాలి. ఆమె వున్నట్టు కూడా చాలా సంవత్సరాలు చెప్పకుండా అత్యున్నత పదవికి వచ్చాకనే అంగీకరించారు. కాని ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. దీంతో అక్కడెక్కడో పల్లెటూళ్లో అన్నయ్య అశోక్‌ అండతో బతుకుతున్న ఆమె జీవితం మారిపోయింది. తనను అనుక్షణం పోలీసులు నిఘాలో వుంచుతున్నారని ఆమె వాపోయింది.తను సిటీ బస్సులో వెళ్తుంటే వారు కార్లు వేసుకుని వెంటరావడమేమిటని ప్రశ్నించారు. భర్తకు సంబంధించిన వివరాల కోసం అనేకసార్లు అధికారులను ఆశ్రయించారు. ఈ మధ్యన కూడా మోడీ పాస్‌పోర్టులో ఏం వివరాలిచ్చారో చెప్పాలని కోరారామె. ఇవన్నీ వింటుంటే ఒక వ్యక్తిగా తనను ఎంత వేదనకు గురవుతున్నదీ తెలుస్తుంది.ఈయన సర్వశక్తివంతుడైన దేశ ప్రధాని. ఆమె నిస్సహాయురాలైన అమాయక పరిత్యక్త గృహిణి.

మోడీ ఏం చేస్తారనేది ఆయన ఇష్టమైనా దేశ ప్రధానిగా భార్య పట్ల ఎలా ప్రవర్తిస్తారనేది తప్పక పట్టించుకోవలసిన విషయమే. గతం ఏదైనా ఆమెకు కూడా ఉత్సాహం అవసరం లేదా? ఆమెలో కాస్త చైతన్యం వస్తే ప్రోత్సహించాల్సిన పనిలేదా? ఆలోచించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గతానికి భిన్నంగా ఎన్నికలు… ఏపీ ప్రజల మద్దతు ఎవరికీ..?

ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతున్నాయి. వైసీపీ - కూటమి పార్టీల మధ్య నువ్వా- నేనా అనే తరహాలో బిగ్ ఫైట్ నడిచింది. డీ అంటే డీ అనే స్థాయిలో ప్రచార పర్వం...

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close