ఇద్దరి మనసులు ఒకటాయె..

రఫీ – ఘంటసాల అనుబంధం

ఘంటసాల మాస్టారుగారికీ మహ్మద్ రఫీకి మధ్య శత్రుత్వమేమీలేదు, వారిమధ్య సున్నితమైన స్నేహబంధం ఉండేది. ఘంటసాలగారిని అప్పట్లో `దక్షణదేశపు మహ్మద్ రఫీ’ అని పిలిచేవారట. దీన్ని ఆయన సానుకూలంగానే స్వీకరించారు. రఫీ పాటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అయితే, ఘంటసాల అభిమానుల్లో కొంతమంది మాత్రం `ఏం, మహ్మద్ రఫీనే ఉత్తరభారతదేశపు ఘంటసాల’గా పిలవొచ్చుకదా అన్న వాదనకు దిగేవారు. ఇదంతా అభిమానంతో అనేమాటలేకానీ, వారిద్దరి మధ్య ఎలాంటి విబేధాలులేవు. భారతీయసినీ సంగీత ప్రపంచంలో ఇద్దరి మనసులు కలిసిపోయాయన్నట్టుగా పాడేవారు.

మహ్మద్ రఫీ భౌతికంగా మననుండి కనుమరుగై ఈరోజుకి (2015 జులై 31నాటికి) 35 సంవత్సరాలు అవుతున్నా ఆయన అందించిన పాటలు మనలను ఆనందడోలికల్లో తేలియాడిస్తూనే ఉన్నాయి. మహ్మద్ రఫీ వర్థంతి సందర్భంగా రఫీగారికి ఘంటసాలతో ఉన్న అనుబంధం గురించన కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకువాలనుకుంటున్నాను.

మహ్మద్ రఫీ అటు ఉత్తరాదిన ఊపేస్తుంటే, ఇటు దక్షిణాదిన ఘంటసాల పాటలు మారుమ్రోగే రోజులవి. 1957లో సంగీత సంచలనంగా `సువర్ణసందరి’ సినిమా వచ్చింది. అక్కినేని, అంజలీదేవి జంటగా నటించిన చిత్రం. ఆదినారాయణరావు సమర్పించిన ఈ చిత్రానికి సంగీతం కూడా వారే సమకూర్చారు. ఈ సినిమాలో అద్భుతమైన పాట – `హాయిహాయిగా ఆమని సాగె…’

గాయనీగాయకుల సామర్థ్యం చాటిచెప్పే పాటఇది. ఈపాటను ఘంటసాల, జిక్కీ ఆలపించారు. మరుసటి ఏడాది అంటే 1958లో సువర్ణసుందరి చిత్రాన్ని హిందీలో నిర్మించారు. ఈ చిత్రానికి ఆదినారాయణరావుగారే సంగీతం అందించారు. `హాయిహాయిగా ఆమని సాగె’ పాటకు హిందీ వర్షెన్ ని మహ్మద్ రఫీ, లతామంగేష్కర్ లతో మద్రాస్ లో రికార్డ్ చేశారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో పాటను అందుకోవడానికి, సాఫీగా పాడటానికి మహ్మద్ రఫీ ఇబ్బంది పడ్డారు. ఇదే రాగంలో సాగిన తెలుగు పాటను ఘంటసాలగారు కేవలం రెండు టేకుల్లో ఒకే చేశారని తెలియగానే రఫీ ఆశ్చర్యపోయారు. అంత తేలిగ్గా ఎలా పాడగలిగారో ఆయనకు అంతపట్టలేదు. చిత్రమేమంటే, అదే సమయంలో వేరేపనిమీద రికార్డింగ్ స్టూడియోకి ఘంటసాల మాస్టారు వచ్చారు. ఘంటసాలగారిని చూడగానే రఫీకి చెప్పలేని ఆనందం కలిగింది. కాసేపు ఉద్వేగానికి లోనయ్యారు. గట్టిగా ఆయన్ని కౌగలించుకున్నారు. అక్కడే ఉన్న లతాజీ ఆపాటను తనతో కలిసి పాడమని కోరినప్పటికీ ఘంటసాలగారు సున్నితంగా తిరస్కరించారు. అదే విషయం ఇంటికి చేరినతర్వాత ఘంటసాల మాస్టారు తన భార్య సావిత్రమ్మతో చెబితే , `లతాజీ పాడమని అడిగితే, పాడచ్చుకదా…’అని అన్నారట. ఘంటసాలగారు చాలా సున్నితమైన మనస్కులు. `రఫీగారు పాడుతున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళి అలా పాడితే రఫీగారిని అవమానించడమే అవుతుంది. అది సంస్కారమనిపించుకోదు ‘ అని ఘంటసాల గారు సమాధానం చెప్పారట.

మహ్మద్ రఫీ, ఘంటసాల ఎవరిదారి వారిదే అయినప్పటికీ, భారతీయ చలనచిత్ర పోకడలోని ఏకాత్మతా ధోరణి వారిమధ్య సన్నిహిత వారధిని ఏర్పరచింది. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య `భలే తమ్ముడు’ సినిమా తీస్తున్నరోజుల్లో ఎవో కొన్ని కారణాలవల్ల (బహూశా కొత్తదనం కోసమనుకుంటా) ఘంటసాలతో కాకుండా మహ్మద్ రఫీతో పాడించాలని నిర్ణయించారు. హిందీచిత్రం రీమేక్ కాబట్టి మహ్మద్ రఫీచేతనే పాడిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఆనాడు అనుకొని ఉండవచ్చు. రఫీని పాడమని అడిగితే, ఘంటసాల మాస్టారు ఉండగా నేను పాడటమేమిటని అన్నారట. మొత్తానికి రఫీని ఒప్పించారు.

పాటల రికార్డింగ్ జరిగే సమయంలో ఘంటసాల మాస్టారు అస్వస్థతతో ఉన్నారని తెలుసుకున్న మహ్మద్ రఫీ మద్రాస్ ఎయిర్ పోర్ట్ నుంచే నేరుగా ఘంటసాల మాస్టారు ఇంటికి వెళ్ళి పలకరించారని చెప్పేవారు. `మీరుండగా నేను పాడటమేమిటి?’ అంటూ రఫీ చలించిపోతే, ఘంటసాల మాస్టారు `మా తెలుగు శ్రోతలు మీ గొంతును తెలుగు పాటలో కూడా వినాలనుకుంటున్నారు, అంతదాకా ఎందుకు నేను కూడా వినాలనుకుంటున్నాను. మీరు నాకు అభిమాని, వెళ్ళి పాడండి ‘ అని చెప్పారట. మహ్మద్ రఫీకి కుడా ఘంటసాల పాటలంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు సభల్లో చెప్పారు.

మహ్మద్ రఫీ తెలుగు పాటలనగానే ఠక్కున గుర్తుకువచ్చేవి భలే తమ్ముడు సినిమాలోని పాటలే. హిందీలో విజయవంతమైన `చైనా టౌన్’ ఆధారంగా తీసిన చిత్రం ఇది. `ఇద్దరి మనసులు ఒకటాయె, సరిహద్దులు లేనే లేవాయె… ‘, `గోపాలబాల నిన్నేచేరి నీసన్నిధి చేరి నీ చుట్టు తిరుగుతు ఉన్నాను… ‘, `ఎంతవారుగాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తూలిపోదురో.. ‘ పాటల్నీ హిట్టే.

రఫీ గొంతు గురించి కచ్చితంగా చెప్పాలంటే సంగీత పామరుడు కూడా అతని పాట వినేసి కూనిరాగాలు తీసేయగలడు. అతను పూర్తి స్థాయి గానప్రతిభ కలవాడా అంటే సమాధానం గట్టిగా చెప్పలేమేమో.. కానీ సినిమా మాధ్యమానికి సంబంధించిన అవసరాలను ఎలా తీర్చాలో భవిష్యత్తు తరాలకు తన పాట ద్వారా స్పష్టంగా మార్గ నిర్దేశనం చేశాడని గట్టిగా చెప్పవచ్చు. అందుకే తెలుగువారు ఘంటసాలను ఎంతగా ఆరాధించారో, అంతే స్థాయిలో రఫీని ఆరాధించారు. రఫీ తెలుగు పాటలు (భలేతమ్ముడు, ఆరాధన, తల్లా పెళ్లామా, అక్బర్ సలీమ్ అనార్కలీ, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి చిత్రాల్లోని పాటలు) తెలుగువారిని అలరిస్తూనే ఉన్నాయి. అలా మహ్మద్ రఫీ, ఘంటసాలవారితోపాటుగా తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close