ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డ‌మే మంచిది

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌కుండానే గుడ్ బై చెప్పేశారు. ర‌జనీ నిర్ణ‌యం చాలామందిని బాధించింది. ర‌జ‌నీ అభిమానుల‌నైతే మ‌రీనూ. `ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావాల్సిందే..` అంటూ ఇప్ప‌టికీ… ర‌జ‌నీ ఫ్యాన్స్ రోడ్డెక్కి గొడ‌వ చేస్తున్నారు. అయితే.. ర‌జ‌నీకాంత్ ఆప్త మిత్రుడు మోహ‌న్ బాబు మాత్రం `ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డ‌మే మంచిది..` అంటున్నారు. ఈమేర‌కు మోహ‌న్‌బాబు ఓ లేఖ విడుద‌ల చేశారు.

“రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్ లోకి రావడం లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధ అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను.

నా మిత్రునితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు మంచివాడివి. చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీ లాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికి ద్రోహం చేయం. డబ్బులు ఇచ్చి ఓట్లు, సీట్లు కొనలేం. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు.

రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న వాళ్లే.. రేపు వచ్చిన తర్వాత చెడ్డవాడని అంటారు. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద. ఆ బురద అంటకుండా నువ్వు రాక పోవడమే మంచిదయ్యింది. రజనీకాంత్ అభిమానులు అందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను“ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు మోహ‌న్ బాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close