మోనాల్ డిమాండ్: 3 నిమిషాల‌కు 15 ల‌క్ష‌లు

బిగ్ బాస్ వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? అని ఎవ‌రైనా అడిగితే.. `ప‌నిలేనివాళ్ల‌ని సెల‌బ్రెటీల‌ను చేస్తుంది. సెల‌బ్రెటీ డిమాండ్ పెంచుతుంది` అనేయొచ్చేమో.? ఎందుకంటే ఈ సీజ‌న్‌లో బిగ్ బాస్ హౌస్ నుంచి వ‌చ్చిన వాళ్ల డిమాండ్ అలా ఉంది. ముక్కు అవినాష్ ఖాతాలో నాలుగు సినిమాలూ, ఓ కామెడీ షో ప‌డింది. సోహైల్ హీరో అయ్యాడు. అభిజిత్ కి హీరోగా మ‌ళ్లీ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు.. మోనాల్ గ‌జ్జ‌ర్ కూడా త‌న త‌డాఖా చూపిస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ న‌టిస్తున్న `అల్లుడు అదుర్స్‌`లో మోనాల్ గ‌జ్జ‌ర్ తో ఓ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేశారు. ఈ పాట కోసం మోనాల్ ఏకంగా 15 ల‌క్ష‌లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. ఇంత‌కీ ఈ పాట ఉండేది మూడంటే మూడు నిమిషాలే. మోనాల్ అడిగినంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లూ రెడీ అయిపోయారు. ఈరోజే మోనాల్ సెట్స్ లోకి అడుగుపెట్టింద‌ని టాక్‌. బిగ్ బాస్ ద్వారా మోనాల్ కి దాదాపు 30 ల‌క్ష‌లు గిట్టుబాటు అయ్యింద‌ని స‌మాచారం. `మా` టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న ఓంకార్ డాన్స్ షో `డాన్స్ ప్ల‌స్‌` కి జ‌డ్జ్ హోదాలో క‌నిపించింది. ఈ షో ద్వారా ఎపిసోడ్ కి రూ.50 వేలు ఆర్జించ‌బోతోంద‌ట‌. ఇలాంటి షోలు, ఐటెమ్ సాంగులూ మ‌రో ఒక‌ట్రెండు ప‌డితే చాలు. మోనాల్ సెటిల్ అయిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close