చైతన్య : సింధుపై కనకవర్షం..! ఎదుగుతున్న వారికేదీ ప్రోత్సాహం…?

గెలిచినోళ్లపై కనకవర్షం కురిపించడమే ప్రోత్సాహమా..? అలా గెలిచే వాళ్లను తీర్చిదిద్దడం ప్రోత్సాహం కాదా..?. ఆటలపై ఆసక్తి ఉన్న నవతరానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని.. కల్పించడానికి ఇష్టపడని ప్రభుత్వాలు .. కోట్లకు కోట్లు పతకం సాధించిన వారికి ఇచ్చేస్తున్నారు. అదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గెలిచిన వారికి ప్రోత్సాహం ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. అసలు బాధ్యతను ప్రభుత్వాలు గుర్తు చేసుకుంటున్నాయా..?. అసలు బాధ్యతను ఎందుకు గుర్తించనట్లు ఉంటున్నాయి…?

సింధుకు కోట్లకు కోట్ల నజరానాలు..!

పూసర్ల వెంకట సింధు ఇప్పుడు… యువతకు ఆదర్శం. ముఖ్యంగా క్రీడల్లో తమదైన ముద్ర వేయాలనుకుంటున్న ఔత్సాహిక తరానికి ఆమె ఓ రోల్ మోడల్. అందులో ఎలాంటి సందేహం లేదు. బ్యాడ్మింటన్‌లో ఆమె ఉన్నత శిఖరాలకు వెళ్లారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించారు. ప్రపంచ చాంపియన్ షిప్ సాధించారు. ఈ సారి ఒలింపిక్స్‌లో గోల్డ్ పై గురి పెట్టారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తర్వాత ఆమెకు అక్షరాల కనకవర్షమే కురిసింది. ఇప్పుడు ప్రపంచ చాంపియన్ అయినందుకు… మరిన్ని ప్రొత్సాహకాలు లభిస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించినప్పుడు ఏపీ ప్రభుత్వం రూ. 3 కోట్లు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి , వెయ్యిగజాల ఇంటి స్థలం ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షలు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇచ్చారు. ఇక ప్రైవేటు సంస్థల నజరానాలు అదనం. ఇప్పుడు ప్రపంచ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన వెంటనే మళ్లీ నజరానాల పర్వం. ఏపీ సర్కార్ విశాఖలో ఐదెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. రేపు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే… వివిధ ప్రభుత్వాలు ఇచ్చే నజరాల గురించి అంచనా వేయలేం.

గెలిచినప్పుడు సరే… గెలవడానికి ప్రభుత్వాలేం చేస్తున్నాయ్..?

గెలిచిన వారిపై కానుకల వర్షం కురిపించడం మంచిదే కానీ… గెలిచేందుకు వారికి ఎంత వరకు.. ఈ ప్రభుత్వాలు.. ఈ ప్రైవేటు వ్యక్తులు… సంస్థలు సాయం చేస్తున్నాయనేది.. ఎవరికీ అంతుపట్టని విషయం. ఏ రాష్ట్రానికైనా క్రీడలు అనేది.. ఓ అన్‌ వాంటెడ్ సబ్జెక్ట్. బడ్జెట్‌లో లెక్కల్లో చెప్పుకోవడానికే… కొన్ని రాష్ట్రాలు నిధులు కేటాయిస్తాయి. కానీ చివరికి ఖర్చు చేసేదేమీ ఉండదు. స్టేడియాలు నాసి రకంగా ఉంటాయి. వాటిలో ప్రైవేటు కార్యక్రమాలు, విందు, వినోదాలు, స్టేజ్ షోలు జరుపుకోవడానికే పర్మిషన్ ఇస్తూ ఉంటారు. అసలు క్రీడలకు ప్రొత్సాహం ఉండదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే… ఆటల్లో… ప్రపంచ స్థాయికి చేరుకునే ప్రతిభావంతులు.. మన చుట్టూనే కనిపిస్తూ ఉంటారు. కానీ వారి ప్రతిభ అంతా.. అక్కడే ఉండిపోతుంది. ఆ ప్రతిభకు సానబట్టి… ప్రపంచస్థాయికి తీసుకెళ్లే తీరిక.. ప్రభుత్వాలకు ఉండదు. అదో వేస్ట్ ఖర్చు అనుకుంటుంది. వాళ్లే కష్టపడి ఎదిగి ఏదైనా సాధించుకొస్తే మాత్రం.. మా తెలుగు బిడ్డ… అని అక్కున చేర్చుకుని కోట్లకు కోట్లు కుమ్మరించేస్తుంది. అక్కడే సమస్య వస్తుంది.

చాంపియన్లను తీర్చిదిద్దడానికి ఆ కోట్లు ఖర్చు పెట్టొచ్చు కదా..!?

పీవీ సింధు ఇప్పుడు చాంపియన్. గెలుచుకొచ్చింది కాబట్టే.. ఆమెకు నజరానాలు ప్రకటిస్తున్నారు. నిజానికి ఆమె ఆ ఆటలో అడుగుపెట్టి… ధృవతారగా పేరు తెచ్చుకుంటున్నప్పుడు.. ఒక్కరంటే.. ఒక్క స్పాన్సర్ కూడా దొరకలేదు. ఆమె తల్లిదండ్రులే నానా తిప్పలు పడి… సింధును ప్రొత్సహించారు. వాళ్లకి కొంత ఆర్థిక వెసులుబాటు ఉంది కాబట్టి అది సాధ్యమయింది. లేకపోతే సింధు కూడా… మరుగునపడిపోయి ఉండేదనేది అంగీకరించాల్సిన సత్యం. నిజానికి ఇలాంటి సింధులు .. ఆర్థిక పరిస్థితులు సహకరించక.. సరైన శిక్షణ లేక… ఎలా ముందడుగు వేయాలో తెలియక… అంతర్థానమైనపోతున్నారు. గెలిచిన వాళ్లకు కోట్లు ఇచ్చే బదులు వారిని వెలికి తీసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడమే … సింధు సాధించే విజయాలకు… గొప్పు గుర్తింపు లాంటిది.

మరింత మంది సింధుల్ని తయారు చేయడానికి ఎందుకు ప్రయత్నించరు..?

ఇప్పుడు సింధుకు కావాల్సింది నగదు బహుమతి కాదు. ఆమె తన స్వయంకృషితో ఎదిగి… కోట్లు సంపాదించుకుంటోంది. ఆమె క్రికెటర్లతో పోటీ పడి ఎండార్స్‌మెంట్లు చేసుకుంటోంది. సింధుతో ప్రచారం చేయించుకోవాలంటే రోజుకు కోటిన్నర చెల్లించాలి. ఫోర్బ్స్‌-2019 మహిళా అథ్లెట్ల జాబితాలో భారత్‌ నుంచి నెంబర్ వన్ గా పీవీ సింధు. ప్రపంచవ్యప్తంగా పీవీ సింధుకు 13వ స్థానం దక్కింది… భారత్‌ నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక మహిళా అథ్లెట్ ఆమె. సింధు ఇప్పటికీ భారత్‌లో అత్యధిక మార్కెట్‌ కలిగిన మహిళా అథ్లెట్‌. ఆమెకు ఇవ్వాల్సింది నజరానాలు కాదు.. ఆమెను… స్ఫూర్తిగా చూపి… మరింత మంది చాంపియన్లను తయారు చేయడం. ప్రభుత్వాలు ఈ విషయాలు తెలుసుకుంటాయా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close