ఎన్టీఆర్‌, బన్నీల భ‌య‌మే నిజ‌మైందా?

శుక్ర‌వారం విడుద‌లైన `గ్యాంగ్ లీడ‌ర్‌`కి నెగిటీవ్ టాక్ వ‌స్తోంది. సెకండాఫ్ ఇంకా బాగుండాల్సింద‌న్న‌ది విశ్లేష‌కుల సారాంశం. విక్ర‌మ్ కె.కుమార్ త‌న తెలివితేట‌ల్ని ట్విస్టుల రూపంలో జోడించ‌డం మ‌ర్చిపోయాడు. ఇంకేమైనా కొత్త మ‌లుపులు ఉంటే బాగుండును అనుకునే ప్రేక్ష‌కుడ్ని నిరాశ ప‌రిచాడు. ఇవ‌న్నీ `గ్యాంగ్ లీడ‌ర్‌`లో కనిపించి ఉండుంటే.. ఈ సినిమా మ‌రో రేంజ్‌లో ఉండేది.

నిజానికి ఈ క‌థ నాని కంటే ముందు బ‌న్నీ, ఎన్టీఆర్ ల ద‌గ్గ‌ర‌కు చేరింది. బ‌న్నీతో విక్ర‌మ్ కుమార్ కొంత‌కాలం ట్రావెల్ చేశాడు. ఈ క‌థ‌తోనే. ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ వంక పెట్ట‌ని బ‌న్నీ, సెకండాఫ్ విష‌యంలో భ‌య‌ప‌డ్డాడు. స్క్రిప్టులో ఇంకొంచెం డెప్త్ కావాల‌ని సూచించాడు. బ‌న్నీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా క‌థ‌ని మ‌ల‌చ‌డానికి విక్ర‌మ్ ఆసక్తి చూపించ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మైత్రీ కంటే ఈ క‌థ ముందుగా వైజ‌యంతీ మూవీస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. స్వ‌ప్న‌ద‌త్‌తో క‌ల‌సి కొన్ని సిట్టింగులు వేశాడు విక్ర‌మ్‌. అప్ప‌ట్లో ఈ క‌థ ఎన్టీఆర్ కోసం త‌యారు చేద్దామ‌నుకున్నారు. కానీ ఎన్టీఆర్ కూడా బ‌న్నీలానే సెకండాఫ్ స‌రిగా లేద‌ని, స్టార్ హీరోకి సరిప‌డంత మెటీరియ‌ల్ ఈ క‌థ‌లో లేద‌ని ఎన్టీఆర్ ఈ క‌థ‌ని ప‌క్క‌న పెట్టిన‌ట్టు టాక్‌. నిజంగానే ఇది స్టార్ హీరో చేయాల్సిన క‌థ కాదు. నాని, ఎన్టీఆర్‌ల భ‌యాలే ఇప్పుడు నిజాల‌య్యాయి. బ‌న్నీ, ఎన్టీఆర్‌ల‌లో ఎవ‌రు చేసినా.. ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఓ స్థాయిలో ఉండేవి. కానీ.. నిల‌బ‌డే ఛాన్సే ఉండేది కాదు. ఆ ప‌రాజ‌య భారం నుంచి ఈ హీరోలిద్ద‌రూ త‌ప్పించుకున్నారు. నానికి ప్ర‌యోగాలు చేయ‌డం, లైట‌ర్ వేలో ఉండే పాత్ర‌లు పోషించ‌డం ఇష్టం కాబ‌ట్టి.. విక్ర‌మ్ క‌థ‌కు ఓకే చెప్పాడు. తాను కూడా సెకండాఫ్ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త ప‌డి ఉంటే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com