‘మోస‌గాళ్లు’ ట్రైల‌ర్‌: డ‌బ్బే డ‌బ్బు..!

పేద‌వాడిగా పుట్ట‌డం త‌ప్పు కాదు, పేద‌వాడిగా చ‌చ్చిపోవ‌డ‌మే త‌ప్పు. పేద‌రికం నుంచి పారిపోవాలంటే డ‌బ్బు సంపాదించ‌డం ఒక్క‌టే మార్గం. అయితే.. అందుకు మార్గాలేంటి? స‌క్ర‌మమైన దారిలో వెళ్తే.. ఎవ‌రూ రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కాలేరు. అందుకే.. అక్ర‌మ‌మైనా మ‌రో కొత్త మార్గాన్ని అన్వేషించాల‌నుకున్నాడు. క‌టిక పేద‌రికం నుంచి – అప‌ర కుబేరుడు అయిపోయాడు. చివ‌రికి ఆ డ‌బ్బంతా ఎక్క‌డ దాచుకోవాలో తెలీయ‌నంత అయోమ‌యంలో ప‌డ్డాడు. ఒక్క‌సారిగా త‌ను కోటీశ్వ‌రుడు ఎలా అయ్యాడు? అందుకు ఎంచుకున్న మార్గం ఏమిటి? అనేది `మోస‌గాళ్లు` చూసి తెలుసుకోవాల్సిందే. మంచు విష్ణు, కాజ‌ల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పేరుకు త‌గ్గ‌ట్టే.. న‌లుగురు మోస‌గాళ్ల చుట్టూ తిరిగే క‌థ ఇది. ఏకంగా రెండు వేల ఆరొంద‌ల కోట్ల స్కామ్ నేప‌థ్యంలో సాగుతుంది. ఆ స్కామ్ ఎవ‌రు చేశారు? దాన్ని పోలీసులు ఎలా ప‌ట్టుకున్నార‌న్న‌ది తెర‌పై చూడాలి. సైబ‌ర్ క్రైమ్ ఈ సినిమాకి కోర్ పాయింట్ గా క‌నిపిస్తోంది.

“డ‌బ్బు సంతోషాన్ని ఇస్తుంద‌నుకున్నా
డ‌బ్బు సెక్యూరిటీ ఇస్తుంద‌నుకున్నా
ఒట్టేసుకున్నా – ఈ పేద‌రికం నుంచి దూరంగా వెళ్లిపోవాల‌ని…

ల‌క్ష్మీదేవి ఎందుకంత రిచ్చో తెలుసా?
నాలుగు చేతుల‌తో సంపాదిస్తుంది కాబ‌ట్టి..

డ‌బ్బున్నోడి ద‌గ్గ‌ర డ‌బ్బు కొట్టేయ‌డం
త‌ప్పేం కాదు..

అనే డైలాగులు ట్రైల‌ర్లో వినిపించాయి. రేసీ స్క్రీన్ ప్లే, ట్విస్టులు ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం అని చిత్ర‌బృందం చెబుతోంది. దానికి త‌గ్గ‌ట్టే.. ట్రైల‌ర్లో షాట్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈమ‌ధ్య విష్ణు చేసిన సినిమాల్లో ఇది విభిన్న‌మైన సినిమానే అనిపిస్తోంది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close