‘వ్యాపమ్’ కుంభకోణం-45 మిస్టరీ మరణాలపై సీబీఐ దర్యాప్తు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీబీఐ దర్యాప్తుకోసం సుప్రీంకోర్టును కోరతామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న చెప్పారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టులో రాష్ట్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వోద్యోగాలకు, వృత్తివిద్యాకోర్సులకు ప్రవేశపరీక్షలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేయటానికి ఉద్దేశించిన మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్) పరీక్షలలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయి. 2013లో బయటపడిన ఈ కుంభకోణంలో పలువురు అధికారులు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు. కుంభకోణం బయటపడినప్పటినుంచి ఇప్పటివరకు దీనితో సంబంధమున్న 45మంది వ్యక్తులు చనిపోయారు. తాజాగా ఈ కుంభకోణంలో చనిపోయిన ఒక బాధితుడి బంధువులను ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరికూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com