మంత్రి `పెద్దమ్మ’కి బిచ్చగాళ్లంటే పడదు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి , ఆయన ఆశయాల గురించి ముందుగా ఒక్క మాట చెప్పుకున్న తర్వాతనే బిచ్చగాళ్లు, రైతులంటే నచ్చని ఒక మహిళా మంత్రిగారి ముచ్చట చెప్పుకుందాం.

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ కి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు కొన్ని ఆదర్శాలున్నాయి. తన ప్రభుత్వం పేదల పక్షమని చాలాగర్వంగా చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపుడతుంటారు. అలాగే, రైతుల కష్టాలు తీర్చాలని తరచూ చెబుతుంటారు. అయితే, ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకు పూర్తి విరుద్ధంగా, ఆయన క్యాబినెట్ లోని ఒక మహిళా మంత్రి ప్రవర్తిస్తున్నారు. ఆమె ఈమధ్యనే రాజకీయాల్లోకి ప్రవేశించిన వ్యక్తి కానేకాదు. రాజకీయాలతో జుట్టు నెరసిన వ్యక్తి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఈ పెద్దమ్మ సీనియర్ మంత్రిగా ఉన్నారు.

ఆమె ఒకటికాదు, రెండుకాదు నాలుగైదు కీలకశాఖలకు మంత్రిగా ఉన్నారు. రాజకీయంగా పైకి ఎదిగినకొద్దీ ఆమెలో అసహనం పెరిగిపోతున్నట్లుంది. ఆమెకు ఇప్పుడు పేదలంటే పడటంలేదు. మరీ ముఖ్యంగా బిచ్చగాళ్లంటే అసహ్యమని తాజా సంఘటనతో తేలిపోయింది. అలాంటి వారు కనబడితే కాలితో తన్నాలనిపిస్తుందేమో…. ఇక రైతుల కష్టాలు అర్థంచేసుకోవడమన్న మాటేలేదు. రైతులపై ఏకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. అయిన్పటికీ, మంత్రిమండలిలో ఆమె స్థానం మాత్రం చెక్కుచెదరడంలేదు. ఇదో విచిత్ర పరిస్థితి.

ఈ సీనియర్ మహిళా మంత్రిపేరు – కుసుం మెహ్దేలె. మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణదినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే ఆదివారంనాడు మంత్రి తన సొంతఊరు పన్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ బస్టాండ్ వద్ద క్లీన్ డ్రైవ్ కూడా చేపట్టారు. ఆ తర్వాత ఆమె తన కార్లోకి ఎక్కబోతుంటే, బిక్షాటన చేసుకునే ఓ బాలుడు కారుకు అడ్డంవెళ్ళి ఆమె కాళ్లమీద పడి అడుక్కోవడం ప్రారంభించాడు. అంతే ఆమెకు కోపం వచ్చి పిల్లాడ్ని తన్నేశారు. ఇంతకీ పిల్లవాడు చేసిన తప్పేమిటంటే, అమ్మగారిని ఓ రూపాయి ఇవ్వమని అడగడమేనట. ఇదంతా వీడియో కెమేరాలో చిక్కింది. అంతే ఆ వీడియో అంతర్జాలంలో వైరల్ గా స్ప్రెడ్ అయింది.

BOY

మంత్రిగారి పర్యటన నిమిత్తం అక్కడే స్పెషల్ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ చాలా దగ్గర నుంచి ఈ విషయమంతా నిశితంగా గమనించాడు. ఆ పిల్లాడు హఠాత్తుగా ఆమె దగ్గరకు వెళ్ళి కాళ్లమీద పడి రూపాయి అడిగాడని చెప్పాడా పోలీస్. ఈ కుర్రాడు ఎవరని ఆరాతీస్తే, బస్టాండ్ లో అడుక్కునేవాడని తేలింది. బహుశా కొత్తగా బిక్షాటన చేయడం మొదలుపెట్టాడేమో, లేకుంటే మంత్రివర్యుల కారుకి అడ్డంగా వెళ్ళి, రూపాయి ఇమ్మని అంత ధైర్యంగా అడుగుతాడా? హన్నన్నా..

కుసుం మహ్దెలె న్యాయశాఖతో పాటుగా శాసనసభ వ్యవహారాలు, ఆరోగ్యం, ఇంజనీరింగ్, పశుసంవర్దక వంటి శాఖలకు ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ మంత్రిగా ఉన్న కుసుం ఇలా వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారికాదు, గతంలో ఆమె రైతులపై కూడా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

`రైతులు తమ కొడుకులను కోల్పోయినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడంలేదు. కానీ పంట పోయిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎవరైనా ఎలా నమ్మడం ?’ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తునేఉన్నాయి.

చౌహాన్ నేతృత్వంలోని పాలన ఏ స్థాయిలో ఉన్నదో, పేదలప్రజలకు, రైతులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో ఈ సంఘటనలు చాటిచెబుతున్నాయంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అంతేకాదు, పేదలకు, రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వం ఒక పక్క చెబుతుంటే, సీనియర్ మంత్రి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రతినిధి కె.కె. మిశ్రా దుమ్ముదులిపారు.

పేదలు, రైతుల పట్ల ఏమాత్రం జాలి, కరుణ లేని ఇలాంటి పాలకులు ఒక్క మధ్యప్రదేశ్ లోనే కాదు, మనదేశంలో చాలాచోట్ల ఉన్నారు. వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కి పైకెదిగిన వాళ్లకు దిగువస్థాయి కష్టాలు తెలియడంలేదు. అందుకే కళ్లునెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా వారికళ్లు తెరిపించాలి.

సరే, ఇంతజరిగినా మరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా చేతులునలుపుకుంటూ కూర్చునేఉంటారా, లేక తన ఆశయాలకు విరుద్ధంగా ఉన్న ఈ పెద్దమ్మ పని పడతారా? వేచిచూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయ వ్యూహాల్లో జగనన్న అడుగుజాడల్లో షర్మిల..!

తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న లక్ష్యంతో ఉన్న వైఎస్ షర్మిల.. రాజకీయ అడుగుజాడలు మొత్తం అన్న జగన్మోహన్ రెడ్డి నే కాపీ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల స్టైల్‌లో...

బండి సంజయ్‌కు కేటీఆర్ ఫైనల్ వార్నింగ్..!

తెలంగాణ మంత్రి కేసీఆర్‌కు కోపం వచ్చింది. తన తండ్రి కేసీఆర్ హోదా, వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాతున్నారంటూ వరంగల్‌లో ఆయన ఫైరయ్యారు.  ఇదే చివరి వార్నింగ్...

సాగర్‌లో కేసీఆర్ సభ ఉంటుందా..?

నాగార్జున సాగర్‌లో గెలవడానికి గతంలో చేసిన తప్పులు చేయకూడదని అనుకుంటున్న కేసీఆర్... బహిరంగసభ పెట్టి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన సభ నిర్వహణకు ఏర్పాట్లు కూడా...

క్రైమ్ : హోంగార్డు భార్య మర్డర్ “మిస్‌ఫైర్”

చేతిలో తుపాకీ ఉంది. ఎదురుగా చంపేయాలన్నంత కోపం తెప్పించిన భార్య ఉంది. అంతే ఆ ఆ పోలీసు ఏ మాత్రం ఆలోచించలేదు. కాల్చేశాడు. తర్వాత పోలీస్ బుర్రతోనే ఆలోచించారు. తుపాకీ మిస్ ఫైర్...

HOT NEWS

[X] Close
[X] Close