సానియా, హింగిస్ జైత్రయాత్ర

హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. ఆదివారం నాడు మార్టినా హింగిస్ తో కలిసి మరో టైటిల్ ను గెల్చుకుంది. సింగపూర్లో డబ్ల్యు.టి.ఎ. టోర్నీమహిళల డబుల్స్ ఫైనల్లో సానియా, హింగిస్ చెలరేగి ఆడి అలవోకగా గెలిచారు. ఈ ఏడాదిలోనే తొమ్మితో టైటిల్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించారు.

సానియో జోడీ జోరుకు, స్పెయిన్ కు చెందిన ప్రత్యర్థులు బేజారయ్యారు. గట్టిగా కౌంటర్ ఇవ్వలేక చేతులెత్తేశారు. దీంతో వరుస సెట్లలో పోరు ముగిసింది. 6-0, 6-3 స్కోరుతో సానియా, హింగిస్ జోడీ విజయం సాధించిందంటే మ్యాచ్ ఎంత ఏకపక్షంగా సాగిందో అర్థమవుతుంది.

సానియా, హింగిస్ జోడీకి ఇది వరసగా 22వ విజయం. టైటిల్స్ పరంగా తొమ్మదో చాంపియన్ షిప్. ఇద్దరి మధ్యా చక్కటి సమన్వయం కుదరడంతో టెన్నిస్ కోర్టులో ఎదురు లేకుండా డబుల్స్ పోటీల్లో వీర విహారం చేస్తున్నారు. ఈ జోడీ పోటీకి దిగుతోందంటే ప్రత్యర్థులు ఓటమికి సిద్ధం కావాల్సిందే అనే స్థాయిలో వీరి హవా నడుస్తోంది.

జనవరిలో సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నీ చాంపియన్ షిప్ సాధించడంతో ఈ జంట జైత్రయాత్ర మొదలైంది. ఈ ఏడాది వీరు సాధించిన విజయాల్లో రెండు గ్రాండ్ స్లాం టైటిల్స్ కూడా ఉన్నాయి. వింబుల్డన్, యు ఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ ను ఈ జోడీయే సాధించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close