వరంగల్ పై కేసీఆర్ చాణక్యం !

తెరాస ప్రభుత్వానికి రెఫరెండంగా విపక్షాలు ప్రచారం చేస్తున్న వరంగల్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులో గెలవడానికి కేసీఆర్ తన రాజకీయ చతురతను పూర్తిగా వినియోగిస్తున్నారు. అభ్యర్థి ఎంపికలోనే ఆ విషయం స్పష్టమైంది. ఉప ఎన్నికలో డబ్బు మంచినీళ్లలా ప్రవహిస్తుందని, అధికార పార్టీ బడా కోటీశ్వరుడిని బరిలోకి దింపుతుందని ఊహాగానాలు వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ, పార్టీకి పరిపూర్ణ విధేయుడైన పసునూరి దయాకర్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. వ్యూహాత్మకంగా చూస్తే కేసీఆర్ ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలను కొట్టడానికి ప్లాన్ చేశారని అర్థమవుతుంది.

నవతరానికి ప్రతినిధిగా దయాకర్ ఎంపిక జరిగింది. వరంగల్ నియోజకవర్గంలో యువ ఓటర్లే ఎక్కువ. ఎప్పుడూ సీటును పట్టుకున వేళ్లాడే వాళ్లేనా అనే అభిప్రాయానికి తావివ్వకుండా కేసీఆర్ కొత్త పంథాలో అభ్యర్థిని ఎంపిక చేశారు. దయాకర్ మొదటి నుంచీ ఉద్యమంలో, పార్టీలో ఉన్నారు. చురుగ్గా పనిచేశారు. పార్టీ ఏ పని అప్పజెప్పినా సమర్థంగా పూర్తి చేశారనే పేరుంది. అన్నింటికీ మించి, ఆయనకు ఓ ప్లస్ పాయింట్ కూడా ఉంది.

తొలిసారిగా తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించాలని కేసీఆర్ నిర్ణయించినప్పుడు, వాటికి ఓ రూపాన్నిచ్చింది దయాకర్. కారణం, ఆయన హైదరాబాద్ జె.ఎన్.టి.యు.లో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. అందుకే, విగ్రహం రూపు రేఖలు ఎలా ఉండాలనేది ప్రాథమికంగా డిజైన్ చేశారు. తర్వాత వాటికి స్వల్పంగా మార్పులు చేసి విగ్రహాల తయారీ చేపట్టారు. గతంలో రెండు సార్లు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించినా అది దక్కలేదు. అయినా పార్టీకి విధేయుడిగా కొనసాగారు. దానికి గుర్తింపుగా ఇప్పుడు ఎంపీ టికెట్ దక్కింది.

కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యతో పోల్చినప్పుడు తెరాస అభ్యర్థే మేలని యువ ఓటర్లు నిర్ణయానికి రావాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. యువత మాత్రమే కాదు, మొత్తం మీద అన్ని వర్గాల వారూ సరైన అభ్యర్థి అతడే అని భావించేలా నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి ధనికుడు కాదు కాబట్టి పార్టీయే ఖర్చు భరిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. అధికార పార్టీ ఖర్చు భరించడం అంటే ఏమిటో అందరికీ తెలుసు. కాబట్టి ఆర్థిక వనరులకు లోటు లేదు. కేడర్ కు కొదువ లేదు. స్వత హాగా కేడర్ లో ఒకడైన అభ్యర్థి పోటీలో ఉన్నప్పుడు ఒక జోష్ తో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థికీ మంచి ఫాలోయింగ్ ఉన్నా ఇదివరకు ఓసారి ఎంపీగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. కాబట్టి ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఎన్డీయే తరఫున ఈ సీటును బీజేపీకి వదిలిపెట్టడం చాలా మంది టీడీపీ నాయకులకు ఇష్టం లేదు. బీజేపీకి బలమైన కేడర్ లేదని, తామే పోటీ చేయాలని తమ్ముళ్లు భావించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది కాబట్టి ఉప ఎన్నికలోనూ దానికే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అయితే బీజేపీ పోటీ నామమాత్రమే అని టీడీపీ నేతలు పలువురు ఆఫ్ ది రికార్డుగా పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద ముక్కోణపు పోటీలో కేసీఆర్ వ్యూహ చతురత నెగ్గుతుందో మరేం జరుగుతుందో వేచి చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close