అదే మరి చంద్రబాబు నాయుడు వ్యూహచతురత!

తనను రాజకీయాల్లో చాణక్యుడు అని అందరూ ఎందుకు అంటూ ఉంటారో.. వ్యూహరచనలో తనను ప్రత్యర్థులు కూడా ఎందుకు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నాడు మరోమారు నిరూపించుకున్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షను విరమింపజేయడానికి సంబంధించి, డిమాండ్లను కొంత మేరకు తాను ఆమోదిస్తున్నట్లుగా కనిపించడానికి వెళ్లిన దూతలను ఎంచుకున్న వైనమే చంద్రబాబునాయుడు వ్యూహచాతుర్యాన్ని తెలియజేస్తున్నది. ముద్రగడతో దీక్ష విరమింపజేయడానికి ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులను పంపించారు. వీరిద్దరినీ ఎంచుకోవడమే పెద్ద వ్యూహం అని పలువురు భావిస్తున్నారు.
ఆ వివరాలు ఎలాగంటే….

(1) ప్రభుత్వం తరఫున దీక్ష విరమింపజేసేలా వెళ్లడానికి కిమిడి కళా వెంకటరావుకు ఉన్న అర్హత ఏమిటి? ఆయన కేవలం పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చి దీక్ష విరమింపజేయడానికి ఎలా వెళ్తాడు? ఇది సాధారణంగా అందరికీ కలిగే సందేహం. కానీ… ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడం ద్వారా చంద్రబాబునాయుడు తన తెలుగుదేశం పార్టీకి అదనపు మైలేజీ కోరుకుంటున్నారు. అందుచేతనే, పార్టీ నాయకుడే వెళ్లి దీక్ష విరమింపజేసినట్లుగా కలర్‌ రావాలని ఆయన ఆరాటపడ్డారనేది సమాచారం. కిమిడి కేవలం ఒక ఎమ్మెల్యే. రాజ్యాంగం పరంగా చూస్తే.. ఎమ్మెల్యే పాత్రలు చాలా పరిమితంగా ఉంటాయి. కాకపోతే.. ప్రభుత్వం తరఫున ఎవరూ లేరని నిందలు రాకుండా అచ్చెన్నాయుడును కూడా జత కలిపారు.

(2) అయినా చంద్రబాబు కాపులకు ఇచ్చే హామీల గురించి కాపేతర ప్రతినిధులు వచ్చి చెబితే ముద్రగడ ఎలా నమ్ముతారు? నమ్మినా దాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారు? కష్టం గనుకనే.. అసలు మంతనాలు, విరమణకు సంబంధించిన హామీ అంతా చంద్రబాబు ఆదివారం రాత్రే పూర్తిచేయించారు. తన తరఫున అసలు సిసలు ప్రతనిధులుగా హామీలు ఇచ్చి మంతనాలు, కాపు ప్యాకేజీ డిస్కషన్‌ పూర్తి చేయడానికి తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావులను ముద్రగడ వద్దకు ఆదివారం పంపి, విరమణకు రంగం సిద్ధం చేసేశారు. అంటే సోమవారం ఉదయం వెళ్లిన వాళ్లు.. కేవలం ముందే షూట్‌చేసేసిన పార్ట్‌కు సంబంధించి.. ఆ పిమ్మట రిహార్సల్స్‌ చేసిన డమ్మీ నటులన్నమాట.

(3) ముద్రగడ దీక్ష విరమింపజేయడానికి తొలుత కిమిడి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు వెళతారనే ప్రచారం జరిగింది. బ్రేకింగ్‌న్యూసులు వచ్చాయి. అయితే ఆ తర్వాత గంటా పేరు మారిపోయి, దాని స్థానంలో అచ్చెన్నాయుడు పేరు జత చేరింది. కాపుల దీక్షలను విరమించడానికి కేవలం కాపులను మాత్రమే పంపడంలో స్కెచ్‌ సవ్యంగా ఉండదని చంద్రబాబు ఫీలయ్యారని అనుకోవాలి.

(4) చిట్టచివరగా ముద్రగడ వద్దకు కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు వెళ్లారు. కళా వెంకటరావు తూర్పు కాపు కులానికి చెందిన నాయకుడు. అచ్చెన్నాయుడు కొప్పుల వెలమ.. బీసీ కులం. కాపుల రిజర్వేషన్‌ వ్యవహారంలో కాపులు పాజిటివ్‌గా ఎంత స్పందిస్తున్నారో, నెగటివ్‌గా బీసీలు కూడా అంతే స్పందించే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబునాయుడు ఎంచుకుని మరీ.. ఒక కాపు, ఒక బీసీ నాయకులను పంపినట్లుగా భావించాలి. పైగా అక్కడకు వెళ్లి మీడియా ముందు మాట్లాడినంత సేపూ అచ్చెన్నాయుడు తాను బీసీ కులానికి చెందిన వాడిని అనే సంగతిని పదేపదే హైలైట్‌ చేసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పదేపదే తాను కూడా ఒక బీసీ మంత్రిగా చాటి చెపుతున్నా అంటూ చాటడానికి ప్రయత్నించారు. ఒకవైపు కళా వెంకటరావుతో కాపులను బీసీల్లో చేర్చడానికి రెడీ అనే విషయాన్ని ప్రకటింపజేస్తూ, మరో వైపు అచ్చెన్నాయుడుతో బీసీలకు అభ్యంతరం లేదనే విషయాన్ని ప్రచారంలోకి తేవడం అనేదే చంద్రబాబునాయుడు వ్యూహచాతుర్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close