ఎన్నిక‌ల‌కు ముందు ముద్ర‌గ‌డ కీల‌క నిర్ణ‌యం..!

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రి నారా లోకేష్ పై కూడా విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు, నారా లోకేష్ ల‌కు హైద‌రాబాద్ లో సొంత ఇల్లు ఉంద‌నీ, అలాంట‌ప్పుడు వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానికులు ఎలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌త నాలుగేళ్లుగా కాపు జాతిని మ‌భ్య పెడుతూ వ‌స్తున్నారు అన్నారు. ఈ సంద‌ర్భంగా, కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల లెక్క‌ల‌కు సంబంధించి స్పందిస్తూ… ప్ర‌జాధ‌నం ఎలా ఖ‌ర్చు చేశార‌ని లెక్క‌లు అడిగితే ముఖ్య‌మంత్రికి కోపం వ‌స్తుంద‌ని ఎద్దేవా చేశారు.

కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశంపై అబ‌ద్ధాలు చెబుతూ నెట్టుకొస్తున్నార‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని కూడా చంద్ర‌బాబు నీరు కార్చేయ‌డం వ‌ల్ల‌నే రాకుండా పోయింద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల‌కు ఓ మూడు నెల‌ల ముందు కాపు జాతి ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా కీల‌క‌ రాజ‌కీయ నిర్ణ‌యం ఉంటుంద‌ని ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించ‌డం విశేషం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపుల మ‌ద్ద‌తు ఏ పార్టీకి ఇస్తార‌నే అంశంపై కూడా స్పందిస్తూ… త‌మ జాతికి న్యాయం చేసేవారికే మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. అంతేకాదు, జ‌న‌సేన పార్టీకి చెందిన కొంత‌మంది త‌న‌ను క‌లిశార‌నీ, పార్టీకి సంబంధించి కొన్ని స‌ల‌హాలూ సూచ‌న‌లూ అడిగి తీసుకున్నార‌ని ముద్ర‌గ‌డ చెప్పారు.

ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు కీల‌క రాజ‌కీయ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ముద్ర‌గ‌డ సంకేతాలు ఇవ్వ‌డం కొంత చ‌ర్చ‌నీయాంశంగానే క‌నిపిస్తోంది. ఓప‌క్క జ‌న‌సేన నేత‌లు త‌న‌ను క‌లిశార‌ని చెబుతారు, స‌ల‌హాల కోస‌మే వ‌చ్చార‌ని చెబుతున్నారు. ఇంకోప‌క్క‌… కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన నిధుల ప్ర‌స్థావ‌న తీసుకొస్తూ లెక్క‌లు చెప్ప‌రా అంటూ కేంద్రం త‌ర‌ఫు వాయిస్ వినిపించే మాదిరిగా స్పందించ‌డ‌మూ విశేష‌మే. సో.. ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు ముద్ర‌గ‌డ తీసుకోబోయే రాజ‌కీయ నిర్ణ‌యం టీడీపీకి వ్య‌తిరేకంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. కాక‌పోతే, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అనేదే చ‌ర్చ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close