“కాపు రిజర్వేషన్ ఉద్యమం” కాడి దించేసిన ముద్రగడ..!

గజదొంగ, కులద్రోహి అంటున్నారని.. ఆ ఆవేదన భరించలేని.. అందుకే కాపు ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని… ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. ఈ మేరకు..బహిరంగ లేఖ విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి సర్కార్ తొలగించింది. ఆ విషయంపై ముద్రగడ పద్మనాభం సైలెంట్‌గా ఉండటమే కాక.. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ మేరకు జగన్‌కు లేఖ రాసి..మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కేంద్రం ఇచ్చే రిజర్వేషన్ల తరహాలో… EWS కోటా కింద వచ్చే పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం చంద్రబాబు కేటాయించారు. అవి అయినా రిజర్వేషన్లు.. వాటిని ఏపీ సర్కార్ అమలు చేయడానికి అధికారం ఉంది.

అయినప్పటికీ.. జగన్‌పై ఒత్తిడి తీసుకు రాకపోవడంతో ముద్రగడపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వైసీపీపై.. జగన్ పై ఈగ వాలకుండా ఆయన కవరింగ్ లెటర్లు కూడా రాస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై.. కాపు నేతలు.. ఉద్యమ సంఘాలు… తీవ్రంగా మండి పడుతున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిఫలం తీసుకుని.. కాపు జాతికి అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ.. టీవీ చర్చల్లోనూ.. ముద్రగడ తీరుపై… తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవన్నీ.. ముద్రగడ దృష్టికి వెళ్లాయేమో కానీ.. తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తాను కదిలించిన రిజర్వేషన్ ఉద్యమం గురించి గొప్పగా చెప్పుకున్నారు.

మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే… కాపు రిజర్వేషన్ అంశం పట్టుకుని తెరపైకి వచ్చి.. నాలుగున్నరేళ్ల పాటు కావాల్సినంత.. రాజకీయ ఉద్రిక్తత తెచ్చి పెట్టిన ముద్రగడ… ప్రభుత‌్వం మారిన తర్వాత మాత్రం సైలెంటయిపోయారు. చేతిలోకి వచ్చిన రిజర్వేషన్ తీసేసినా.. కార్పొరేషన్ పేరుతో.. అందరికీ ఇచ్చే పథకాలనే కాపులకూ.. ఇస్తూ.. అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా ఆయన స్పందించడం లేదు. చివరికి.. ఈ గొడవ అంతా ఎందుకనుకున్నారేమో కానీ… మొత్తానికే కాడి దించేశారు. బహుశా.. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారేమోనని.. ఇతరుల నుంచి సెటైర్లు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ పోలీసుల పనితీరు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లింది..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు... రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్...

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...

HOT NEWS

[X] Close
[X] Close