ముద్రగడ ఈ సారి తటస్థమే..!

ముద్రగడ పద్మనాభంను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు… ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒక బృందంతో కలిసి వెళ్లి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశానికి కాపు జేఏసీ నేతలు కూడా వచ్చారు. ముద్రగడకు లేదా ఆయన కుటుంబానికి టీడీపీ టికెట్‌ నేతలు ఆఫర్‌ ఇచ్చారు. రాష్ట్రమంతా ప్రచారం చేయాలని టీడీపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే కాపు జేఏసీ నేతలకు కూడా అవకాశాలు ఇవ్వాలని ముద్రగడ కోరారు. కానీ.. టీడీపీ నేతలు మాత్రం.. ఆ విషయంపై తర్వాత చర్చిద్దామని వెళ్లిపోయారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ.. టీడీపీపై ఓ రేంజ్‌లో పోరాటం చేశారు. ఉద్యమాలు చేశారు. చివరికి… ఇప్పుడు.. కేంద్రం తెచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం కల్పించి చంద్రబాబు హామీ నిలబెట్టుకున్నారు. దీంతో ముద్రగడకు అజెండా లేకుండా పోయింది. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ.. చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపించారు. కానీ, ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయడం ప్రారంభించారు. మరోవైపు ముద్రగడను వైసీపీ వైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం.. ఈ సారికి తటస్థంగా ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకుని రాజకీయ భవిష్యత్ వెదుక్కున్నారనే విమర్శలు వస్తాయని.. కాపు జేఏసీ నేతలు తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతో… ముద్రగడ వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో… ముద్రగడకు మంచి ఆఫర్లు ఏమైనా వస్తే.. స్పందించేందుకు అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close