‘ముఫాసా’ ట్రైల‌ర్ చూశారా: మ‌హేష్ మ్యాజిక్ ‘వినిపించింది’

డిస్నీ స్టూడియోస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన యానిమేష‌న్ చిత్రం ‘ముఫాసా’. ఈ చిత్రానికి మ‌హేష్ బాబు డ‌బ్బింగ్ చెప్ప‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ‘ముఫాసా’ పాత్ర‌కు మ‌హేష్ గాత్ర‌దానం చేయ‌డంతో ‘ముఫాసా’ తెలుగు వెర్ష‌న్ పై ఫోక‌స్ ప‌డింది. ఇప్పుడు ట్రైల‌ర్ ని తెలుగులో విడుద‌ల చేశారు. మ‌హేష్ గొంతులో ఓ మ్యాజిక్ ఉంటుంది. కొన్ని డైలాగులు మ‌హేష్ గొంతు వ‌ల్ల మెరుస్తాయి. ఈ ట్రైల‌ర్‌లో ఆ మ్యాజిక్ కనిపించింది. ముఖ్యంగా ‘ఇందాకేదో చెప్పావే..’ అన్న‌చోట ‘మాస్’ మ‌హేష్ క‌నిపించాడు. ట్రైల‌ర్ లో బ్ర‌హ్మానందం, అలీ గొంతులు కూడా వినిపించాయి.

హాలీవుడ్ చిత్రాలు తెలుగు డ‌బ్బింగ్ లో చూస్తుంటే మ‌న‌దైన ఎట‌కారం, చ‌మ‌త్కారాలు క‌నిపిస్తాయి. ‘ముసాఫా’ అందుకు మిన‌హాయింపు కాదు. యానిమేటెడ్ పాత్ర‌లు చిన్న పిల్ల‌ల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే అవ‌కాశం ఉంది. మ‌హేష్ పాత్ర కూడా తోడ‌య్యింది కాబ‌ట్టి ఆయ‌న అభిమానులు ఈ సినిమాపై దృష్టి సారించొచ్చు. 2 నిమిషాల 34 సెక‌న్ల ఈ ట్రైల‌ర్ హాలీవుడ్ చిత్రాల్ని ఇష్ట‌ప‌డేవాళ్ల‌ని ఆక‌ర్షిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబ‌రు 20న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై క్లారిటీ కోరుకుంటున్న క్యాడర్

జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితి గురించి ఆ పార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకుంటారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడానికి ఏ మాత్రం సంకోచించని ఆయన అధికారం ఉన్నప్పుడు.. లేనప్పుడు.. ...

వైఎస్ వివేకా కేసులో కదలిక మళ్లీ ఎప్పుడు ?

వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక ఎప్పుడు ? ఈ అంశం అనే మందికి ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పుడు దర్యాప్తు లేదు.. ట్రయల్ లేదు. నిందితులు మెల్లగా బెయిల్...

ఓటీటీ ఆడియన్స్ వున్నారు జాగ్రత్త !

సినిమాకి ఇప్పుడు రెండు దశల్లో రివ్యూలు వస్తున్నాయి. థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్. థియేటర్స్ లో చూస్తున్నపుడు ఆడియన్ మూడ్ వేరు. అక్కడ కాస్త ఉదారంగా ఉంటాడు ప్రేక్షకుడు. మామూలు జోక్...

అప్రూవర్ విశాల్ గున్నీ ?

పోస్టింగ్ ఆశ చూపి ఐపీఎస్ విశాల్ గున్నీతో అన్ని అడ్డగోలు పనులు చేయించారు. ఉన్నతాధికారులు చెప్పిన మాటలను తాను జవదాటలేనని అలా దాటితే.. తన పరిస్థితి ఏమవుతుదో తెలుసు కాబట్టి వారు చెప్పినట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close