బాణం, సోలో లాంటి డీసెంట్ హిట్స్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు నారా రోహిత్. తన ఖాతాలో ప్రతినిధి లాంటి మంచి సినిమాలున్నాయి. అయితే ఆ తరవాత ట్రాక్ తప్పాడు. వరుస ఫ్లాపులు, ఆ తరవాత విరామం. ఇటీవల ‘ప్రతినిధి 2’ అంటూ ఓ ప్రయత్నం చేశాడు కానీ ఫలించలేదు. ఇప్పుడు రొమాంటిక్ మూడ్ లోకి మారిపోయి ‘సుందరకాండ’ అనే సినిమాలో నటించాడు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. టీజర్ ఈరోజు విడుదలైంది
ఇదో రొమాంటిక్ ఎంటర్‌టైనర్. జుత్తుకు రంగేసుకొనే వయసొచ్చినా, పెళ్లికాని ఓ యువకుడి కథ ఇది. తనకు ఐదు లక్షణాలున్న అమ్మాయి కావాలి అంటూ… వేట మొదలెడతాడు. ఆ ఐదు లక్షణాలేంటి? అలాంటి అమ్మాయి దొరికిందా, లేదా? అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కామెడీకి మంచి స్కోప్ ఉన్న కథలా కనిపిస్తోంది. సత్య, అభినవ్ గోమటం, నరేష్, రఘుబాబు లాంటి హాస్యనటులు, వాళ్ల టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. రోహిత్ లుక్ కూడా బాగుంది. ఈ సినిమా కోసం కొంత స్లిమ్ అయినట్టు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తెలుగులో వినిపిస్తున్న రాప్… ఆకట్టుకొనేలా ఉంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్లకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జోనర్‌లో సినిమా వచ్చి కూడా చాలాకాలమైంది. మొత్తానికి నారా రోహిత్ ఇప్పుడు రైట్ ట్రాక్ లో పడినట్టు కనిపిస్తోంది. టీజర్ పాస్ అయిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Sridevi dorikindhoch. Inka. 44. Years hero ke. Time raledu papam