ముఖేష్ అంబానీ చాయిస్ ఈ సారి కాంగ్రెస్ పార్టీ..? మద్దతుగా వీడియో రిలీజ్..!

దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ.. కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికారు. దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మిలింద్ దేవ్‌రా తరపున ఓ వీడియో కూడా విడుదల చేశారు. దక్షిణ ముంబైకి నిజమైన పుత్రుడు మిలింద్ అని.. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖేష్ అంబానీ ఇలా నేరుగా కోరడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎందుకంటే.. నరేంద్రమోడీతో.. అంబానీ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. రెండో సారి ప్రధాని అయ్యేందుకు.. మోడీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముఖేష్ అంబానీ నేరుగా మద్దతు ప్రకటించడం.. ఓ రకంగా… సంచలనం సృష్టిస్తోంది.

నిజానికి కాంగ్రెస్ పార్టీ..ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీపై.. తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. రాఫెల్ డీల్ విషయంలో.. మోడీ.. వేల కోట్లు ప్రజాసంపద.. అనిల్ అంబానీకి దోచి పెట్టారని ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలోనే మోడీ దొంగ అని.. అని కూడా అంటోంది. అయినప్పటికీ.. ముఖేష్ అంబానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడానికి ఏ మాత్రం సందేహించలేదు. దీనిపై రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే.. అంబానీ తన స్టాండ్ మార్చుకున్నారని.. దేశంలో గాలి ఎటు ఉందో..అంబానీ గుర్తించారని.. అంటున్నారు. వ్యాపారవేత్తలు.. ఎవరు గెలుస్తారని అనుకుంటే వారి వైపు ఉంటారని చెబుతున్నారు.

ముఖేష్ అంబానీ.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది సోషల్ మీడియాలో విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ముఖేష్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. కొంత మందికి అంబానీలతో.. మిలింద్ దేవ్ రా కుటుంబానికి ఉన్న స్నేహమే.. ఇలా మద్దతివ్వడానికి కారణం అని చెబుతున్నారు. మిలింద్ దేవ్ రా తండ్రి మురళీ దేవ్ రా, ముఖేష్ అంబానీ తండ్రి ధీరూబాయ్ అంబానీ మంచి మిత్రులు. అప్పటి నుంచి ఆ కుటుంబాల మధ్య స్నేహం ఉందంటున్నారు. మిలింద్ దేవ్‌రాకు మాత్రమే ముఖేష్ మద్దతు ప్రకటించారని… కాంగ్రెస్ పార్టీకి కాదని.. కొంత మంది చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు.. హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com