బ‌న్నీ కోసం ముంబై టీమ్‌

అల్లు అర్జున్ స్టైల్ ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటుంది. త‌న హెయిన్ స్టైల్‌, డ్రస్సింగ్‌.. ఇలా ఏ విష‌య‌ల్లోనూ రాజీ ప‌డ‌డు. కొత్త‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డానికి త‌ప‌న ప‌డుతుంటాడు. అందుకే త‌న‌ని స్టైలీష్ స్టార్ అన్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో`లోని బ‌న్నీ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు మ‌రో లుక్‌లోకి మారిపోతున్నాడు. అల్లు అర్జున్ – సుకుమార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శేషాచ‌లం అడ‌వుల నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అందుకే ఈ సినిమా కోసం `శేషాచ‌లం` అనే పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో బ‌న్నీ మాస్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా కోసం బ‌న్నీ గెడ్డం పెంచ‌బోతున్నాడ‌ట‌. హెయిర్ స్టైల్‌, కాస్ట్యూమ్స్ కూడా కొత్త‌గా ఉండ‌బోతున్నాయి. అందుకోసం ముంబై నుంచి ఓ ప్ర‌త్యేక‌మైన టీమ్ రాబోతోంది. బ‌న్నీపై కొన్ని స్పెష‌ల్ ఫోటోషూట్స్ నిర్వ‌హించ‌బోతున్నారు. దాన్ని బ‌ట్టి బ‌న్నీ లుక్‌ని డిసైడ్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. బ‌న్నీ డైలాగ్ డెలివ‌రీలోనూ చాలా మార్పు క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌న్నీని ఒక ర‌కంగా చూశామ‌ని, ఈ సినిమాలో బ‌న్నీని మ‌రో ర‌కంగా చూడ‌బోతున్నామ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సాధార‌ణంగా ప్ర‌తీ సినిమాలోనూ త‌న హీరో లుక్ ఇలా ఉండాల‌ని సుకుమార్ డిసైడ్ చేస్తుంటాడు. అయితే లుక్ విష‌యంలో బ‌న్నీకి సుక్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. అందుకే బ‌న్నీ కొన్ని కొత్త ర‌కాల లుక్స్ ట్రై చేస్తున్నాడ‌ట‌. అవి సుకుమార్‌కీ నచ్చితే… ఇక అదే లుక్‌లో ఈ సినిమాలో క‌నిపిస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close