నాగేశ్వ‌ర‌రావు… కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌!

నాగ‌చైత‌న్య – ప‌ర‌శురామ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి ‘నాగేశ్వ‌ర‌రావు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్య సినిమాకి ఆ పేరు పెట్ట‌డం త‌ప్ప‌నిస‌రిగా ఎట్రాక్ట్ చేసే విష‌య‌మే. నాగేశ్వ‌ర‌రావు అనేది పాత‌త‌రం పేరు. ఈ సినిమాలో చైతూ పాత్ర చిత్ర‌ణ కూడా అదే త‌ర‌హాలో ఉంటుందట‌. వ‌య‌సు చిన్న‌దే అయినా, పాత‌కాలం భావాలు, పెద్ద‌రికం, బాధ్య‌త‌లూ.. ఇవ‌న్నీ చైతూలో క‌నిపిస్తాయ‌ట‌. అన్న‌ట్టు ఈ సినిమాకి ‘కంప్లీట్ ఫ్యామిలీ మేన్’ లేదా ‘ప్యాక్డ్ ఫ్యామిలీ మెన్‌’ అనే క్యాప్ష‌న్ పెట్టాల‌ని భావిస్తున్నారు. గీత గోవిందంతో హిట్టు కొట్టిన ప‌ర‌శురామ్‌… ఆ సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు. మ‌రోసారి వాళ్ల‌ని టార్గెట్ చేస్తూ ఈ క‌థ‌ని రాసుకున్నాడ‌ట‌. ‘గీత గోవిందం’లో హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ కూడా హైలెట్‌గా ఉంటుంది. ఇందులోనూ క‌థానాయిక పాత్ర ని చాలా స్ట్రాంగ్ గా తీర్చిదిద్దాడ‌ట‌. ఆ పాత్ర కోసం ర‌ష్మిక‌, కీర్తి సురేష్ ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే చైతూ, నాగార్జున‌ల‌కు లైన్ చెప్పేశాడు ప‌ర‌శురామ్. ప్ర‌స్తుతం డైలాగ్ వెర్ష‌న్ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే క్లాప్ కొట్టేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది చిత్ర యూనిట్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close