సాహోకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ల షాక్‌.. ఎందుక‌ట‌..?

సాహోకి ఓ షాక్‌. ఈ సినిమా నుంచి సంగీత త్ర‌యం త‌ప్పుకొంది. సాహో చిత్రానికి శంక‌ర్ – ఎహ‌సాన్ – లాయ్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ ఈ టీమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. `అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా చేయ‌లేక‌పోతున్నామ‌ని` ఈ సంగీత త్ర‌యం ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. దాంతో.. సాహో టీమ్ కొత్త సంగీత ద‌ర్శ‌కుడి వేట‌లో ప‌డింది.

సాహో స‌మ‌స్య‌ల్లో సంగీతం ఒక‌టి. శంక‌ర్ – ఎహ్‌సాన్ -లాయ్‌… బాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు సంగీతం అందించారు. అయితే… ద‌క్షిణాది నాడి మాత్రం వీళ్ల‌కు అంత‌గా తెలీదు. ఇక్క‌డి స్టైల్‌, మాసిజం ప‌సిగ‌ట్ట‌లేక‌పోయాయి. వీళ్ల పాట‌ల్లో వెస్ట్ర‌న్ ఛాయ‌లు మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అవి తెలుగు ప్రేక్ష‌కులు ఎక్కే ఛాన్సులు చాలా త‌క్కువ‌. స‌రిగ్గా ఇక్క‌డే సుజీత్ కీ ఈ సంగీత త్ర‌యానికీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సంగీత ద‌ర్శ‌కులు ఇచ్చిన ట్యూన్లు.. సుజిత్‌కి న‌చ్చ‌క‌పోవ‌డం, మార్పులూ చేర్పులూ చెప్పినా – ఆట్యూనులు మార‌క‌పోవ‌డంతో సుజిత్ బాగా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌. `ఇన్నిసార్లు మార్చ‌మంటే మావ‌ల్ల కాదు` అనే టైపులో శంక‌ర్ – ఎహ్ సాన్ – లాయ్‌లు విసుకున్నార‌ని స‌మాచారం. పాట‌లు ఇవ్వ‌డంలోనూ చాలా జాప్యం చేశార‌ని, ఈ విష‌యంలో చిత్ర‌బృందానికీ సంగీత త్ర‌యానికీ మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రిగాయని, కేవ‌లం ట్యూన్ల కోస‌మే నెల‌ల త‌ర‌బ‌డి సుజిత్ ముంబై వెళ్లి వ‌చ్చేవాడ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే మూడు పాట‌ల్ని రికార్డు చేశారు కూడా. ఆ పాట‌ల్ని వాడ‌తారా? లేదంటే వ‌దిలేస్తారా? అనేది చూడాల్సివుంది. పాట‌లు రికార్డ్ చేసినా, వాటిని షూట్ చేయ‌క‌పోవం వ‌ల్ల‌.. ఆర్థికంగా న‌ష్ట‌మేం వాటిల్ల‌లేదు. ఇప్ప‌టికిప్పుడు మ‌రో సంగీత ద‌ర్శ‌కుడ్ని వెదికి ప‌ట్టుకుని, ట్యూన్లు సిద్ధం చేసి, వాటినిచిత్రీక‌రించాలంటే.. పెద్ద ప‌నే ప‌డింది. మ‌రి సాహోని భుజాల‌పై వేసుకునే ఆ సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రో చూడాలి. ఈసారి కూడా బాలీవుడ్ వైపే చూస్తారా? లేదంటే ద‌క్షిణాది సంగీత ద‌ర్శ‌కుడ్ని న‌మ్ముకుంటారా? అనేది తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close