రూ.89 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సినిమా

మైత్రీ మూవీస్ అన‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాలే గుర్తొస్తాయి. జ‌న‌తా గ్యారేజ్‌, శ్రీ‌మంతుడు, రంగ‌స్థ‌లం.. ఇలా అన్నీ స్టార్ హీరోల‌తోనే చేశారు. ఇప్పుడు వ‌స్తున్న స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రెండూ భారీ చిత్రాలే. ఒక్కో సినిమాకీ దాదాపు రూ.60 నుంచి 70 కోట్లు పెట్ట‌క‌పోతే వాళ్ల‌కు సినిమా తీసిన‌ట్టే అనిపించ‌దు. అలాంటిది ఇప్పుడో చిన్న సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. దాని బ‌డ్జెట్ ఎంతో తెలుసా?? రూ.89 ల‌క్ష‌లు. రితీష్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నాడు. సంగీతం, కెమెరా, ఎడిటింగ్‌, సీజీ.. ఈ డిపార్ట్‌మెంట్ల‌న్నీ కొత్త‌వాళ్ల‌తోనే నిండిపోబోతోంది. మ‌రో ప‌ది రోజుల్లో షూటింగ్ కూడా మొద‌లెట్టేస్తార్ట‌.

మైత్రీ మూవీస్ నిర్మాత‌ల‌లో ఒక‌రైన న‌వీన్ మాట్లాడుతూ ”చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. మంచి సినిమా తీయ‌డ‌మే ముఖ్యం. స్టార్ హీరోల‌తోనే కాదు, కొత్త‌వాళ్ల‌తో కూడా ప్ర‌యోగాలు చేస్తాం. పెద్ద సినిమా పెట్టుబ‌డి తిరిగి రావ‌డానికి మూడు రోజులు ప‌డితే, చిన్న సినిమా హిట్ట‌యితే ప‌ది రోజులు ప‌డుతుంది. అంతే తేడా. చిన్న సినిమా కోసం ఓ మంచి టీమ్ దొరికింది. 89 ల‌క్ష‌ల్లో సినిమా పూర్తి చేస్తాం. ప‌బ్లిసిటీతో క‌లిపి రూ.1.5 కోట్లు అవుతుంది” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేసీపై కేసు: మీసం మెలేసినందుకూ పెడతారా..!?

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభారక్ రెడ్డిపై మీసం మెలేశారంటూ పోలీసులు కేసులు పెట్టడం సంచలనంగా మారింది. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందూ వెనుకా ఆలోచించకుండా కేసులు పెట్టేశారు....

ఏకగ్రీవం అవుతాయని తెలిసినా ఎన్నికలు వాయిదా..! కేసీఆర్ ప్లానేంటి..?

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమయిందని.. ఆరుగురికి ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయని ఆశావహులు పండుగ చేసుకుంటున్న సమయంలో కేసీఆర్ వారందరికీ పిడుగులాంటి వార్త పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడల్లా...

ప్చ్.. సింధు..! సెమీస్‌లో ఓటమి..!

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించుకు వస్తుందని సింధుపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి తైజూపై పైచేయి సాధించడంలో సింధూ విఫలమయింది. వరుస సెట్లలో పరాజయం పాలైంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోందన్న...

టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ హీరోల రీ ఎంట్రీ సీజన్

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ లో గతం లో ఫేడ్ అవుట్ అయిన హీరోల రీ ఎంట్రీ సీజన్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతం లో హీరోలు గా కొంత కాలం పాటు విజయ...

HOT NEWS

[X] Close
[X] Close