లైన్ క్లియ‌ర్‌: ర‌వితేజ – సంతోష్ శ్రీ‌న్‌వాస్ డిసెంబ‌రులో

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా సంతోష్‌శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం ప‌ట్టాలెక్కాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ సెట్ చేసింది. కానీ ఎందుక‌నో.. ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్‌లోనే ఉండిపోయింది. దాంతో ఈసినిమా ఆగిపోయిందంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై మైత్రీ మూవీస్ స్పందించింది. ”ఈ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంది. డిసెంబ‌రులో సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ‘తేరీ’ రీమేక్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అది నిజ‌మే. కానీ.. తేరీ సినిమాని య‌ధాత‌థంగా రీమేక్ చేయ‌డం లేదు. తేరీలో ఉన్న పాయింట్ ని మాత్ర‌మే తీసుకున్నాం” అని క్లారిటీ ఇచ్చేసింది. మైత్రీ మూవీస్ నుంచి వ‌స్తున్న ‘స‌వ్య‌సాచి’ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వ‌చ్చే నెల‌లో ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ కూడా విడుద‌ల‌కు రెడీ అయ్యింది.

మైత్రీ మూవీస్ చేతిలో దాదాపు 14 సినిమాలున్న‌ట్టు ఓ అంచ‌నా. దీనిపై కూడా మైత్రీ స్పందించింది. ”మ‌రీ 14 లేవు గానీ, ఓ ప‌ది వ‌ర‌కూ ఉన్నాయి. అయితే… అన్నీ ఒకేసారి మొద‌ల‌వ్వ‌లేవు క‌దా? ఒక‌సారి రెండు సినిమాల్ని మాత్ర‌మే ప‌ట్టాలెక్కించ‌గ‌లం. ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే.. ఇప్పుడు కాస్త స్పీడ‌ప్ అయ్యాం.. యేడాదికి క‌నీసం మూడు చిత్రాల్ని అందివ్వాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నాం” అంటున్నారు మైత్రీ మూవీస్ నిర్మాత‌లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

HOT NEWS

[X] Close
[X] Close