‘డిస్కోరాజా’లో సునీల్‌

హీరోగా త‌న ఇన్నింగ్స్‌ని దాదాపుగా పుల్ స్టాప్ పెట్టేసిన సునీల్‌, క‌మెడియ‌న్ పాత్ర‌ల‌వైపు దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`తో కాస్త బ్రేక్ వ‌చ్చిన‌ట్టైంది. క్ర‌మంగా త‌న‌కు అవ‌కాశాలూ పెరుగుతున్నాయి. ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో క‌నిపించే `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` సినిమాలో హాస్య న‌టుడిగా క‌నిపించ‌బోతున్నాడు సునీల్‌. ఇప్పుడు మ‌రోసారి ర‌వితేజ సినిమాలోనే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా `డిస్కోరాజా` అనే సినిమా తెర‌కెక్క‌నుంది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇందులో సునీల్‌కి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ర‌వితేజ రిక‌మెండేష‌న్‌తోనే సునీల్‌కి ఈ ఛాన్స్ వ‌చ్చింద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో సునీల్ పాత్ర బాగా పండింద‌ట‌. అది దృష్టిలో ఉంచుకునే… ఈ సినిమాలో ఛాన్స్ ఇప్పించాడ‌ని తెలుస్తోంది. ఈ దీపావ‌ళికి మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేస్తారు. టైటిల్ ని కూడా అప్పుడే ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేసీపై కేసు: మీసం మెలేసినందుకూ పెడతారా..!?

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభారక్ రెడ్డిపై మీసం మెలేశారంటూ పోలీసులు కేసులు పెట్టడం సంచలనంగా మారింది. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందూ వెనుకా ఆలోచించకుండా కేసులు పెట్టేశారు....

ఏకగ్రీవం అవుతాయని తెలిసినా ఎన్నికలు వాయిదా..! కేసీఆర్ ప్లానేంటి..?

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమయిందని.. ఆరుగురికి ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయని ఆశావహులు పండుగ చేసుకుంటున్న సమయంలో కేసీఆర్ వారందరికీ పిడుగులాంటి వార్త పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడల్లా...

ప్చ్.. సింధు..! సెమీస్‌లో ఓటమి..!

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించుకు వస్తుందని సింధుపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి తైజూపై పైచేయి సాధించడంలో సింధూ విఫలమయింది. వరుస సెట్లలో పరాజయం పాలైంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోందన్న...

టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ హీరోల రీ ఎంట్రీ సీజన్

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ లో గతం లో ఫేడ్ అవుట్ అయిన హీరోల రీ ఎంట్రీ సీజన్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతం లో హీరోలు గా కొంత కాలం పాటు విజయ...

HOT NEWS

[X] Close
[X] Close