నాగ అశ్విన్ సినిమా ఇంకాస్త వెన‌క్కి?

ప్ర‌భాస్ పై అభిమానుల‌కు కొంచెం అసంతృప్తి ఉంది. ప్ర‌తీ సినిమాకీ రెండేళ్లు కేటాయించుకుంటూ వెళ్తున్నాడ‌ని. తాను చేసేవ‌న్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే. కాబ‌ట్టి.. ఆ మాత్రం స‌మ‌యం తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. రాధే శ్యామ్ కూడా ఏళ్ల త‌ర‌బ‌డి మేకింగ్ లోనే ఉంది. `ఆది పురుష్‌` సినిమా కూడా అంతే. ఆ త‌ర‌వాత చేయ‌బోయే నాగ అశ్విన్ సినిమా విష‌యంలోనూ ఇదే రిపీట్ అవుతోంది. ఈ సినిమాకి రెండున్న‌రేళ్ల పాటు ప్ర‌భాస్ కాల్షీట్లు కావ‌ల్సివ‌స్తాయ‌ట‌. ఇప్పుడు ఈ విష‌యంలోనే ప్ర‌భాస్ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు స‌మాచారం.

నిజానికి `రాధే శ్యామ్‌` త‌ర‌వాత‌.. నాగ అశ్విన్ సినిమానే ప్రారంభించాలి. దాన్ని ఓకే చేయ‌కుండా…. `ఆదిపురుష్‌`కి సై అన్నాడు. `ఆదిపురుష్‌` చేశాక‌.. నాగ అశ్విన్ సినిమా చేయాలిప్పుడు. కానీ… ఇప్పుడు ఈ సినిమాని ఇంకాస్త వెన‌క్కి జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో ప్ర‌భాస్ సినిమా దాదాపుగా ఖాయం అయ్యింది. నాగ అశ్విన్ సినిమాకంటే ముందు ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టు మొద‌లయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. నాగ అశ్విన్ బ‌ల్క్ కాల్షీట్లు అడిగాడ‌ని, ఆ సినిమా చేస్తున్న‌ప్పుడు మ‌రో సినిమా చేసే అవ‌కాశం లేద‌ని, అందుకే … మిగిలిన సినిమాల‌న్నీ పూర్తి చేసుకుని, ఆ త‌ర‌వాతే నాగ అశ్విన్ సినిమా మొదలెట్టాల‌ని ప్ర‌భాస్ తాజాగా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. 2021లోనూ నాగ అశ్విన్ సినిమా మొద‌లు కాక‌పోవొచ్చు. 2022 చివ‌ర్లో ఉండే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జస్ట్ మిస్..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినంత పనయింది. చివరికి ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తి బతిమలాడి..ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తామని హామీ ఇచ్చి..ఆ వారెంట్ జారీ కాకుండా నిలుపగలిగారు. కోర్టుల్ని.....

అప్పుడే కంట్రోల్ తప్పుతున్న టీఆర్ఎస్ నేతలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ క్రమంగా పార్టీపై.. పార్టీ నేతలపై పట్టు కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కుమారుడికి పట్టం కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత పార్టీ నేతలు... కేటీఆర్‌కు మద్దతుగా...

నిమ్మగడ్డతో బదిలీల గేమ్ ఆడుతున్న ప్రభుత్వం ..!

పంచాయతీ ఎన్నికల విషయంలో లేని పోని పంతాలకు పోయి తల బొప్పి కట్టించుకున్న ఏపీ ప్రభుత్వం కొత్తగా... ఎస్‌ఈసీతో బదిలీల గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదీ,...

ఎంపీలకు జగన్ దిశానిర్దేశం..! ఇప్పుడైనా పోరాడతారా..?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ... ఏపీకి చెందిన ఎంపీలతో సమావేశం పెట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. సాధించాల్సిన ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు. ఇరవై రెండు మంది...

HOT NEWS

[X] Close
[X] Close