చిరు కూడా.. సంక్రాంతి త‌ర‌వాతే వ‌స్తాడ‌ట‌

చిరంజీవి `ఆచార్య‌` షూటింగ్ ఈమ‌ధ్యే పునః ప్రారంభం అయ్యింది. న‌వంబ‌రు 20 నుంచి చిరు సెట్లోకి అడుగుపెడ‌తారునుకున్నారంతా. అయితే.. సంక్రాంతి త‌ర‌వాతే చిరు ఆచార్య సెట్లోకి అడుగుపెడ‌తాడ‌ని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కాల్షీట్లు సంక్రాంతి త‌ర‌వాతే ల‌భ్యం అయ్యాయి. జ‌న‌వ‌రి మూడో వారం నుంచి చ‌ర‌ణ్ సెట్ కి వ‌స్తాడు. అప్పుడే చిరు కూడా సెట్లోకి అడుగుపెడ‌తాడ‌ని, ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క‌మైన సన్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.

నిజానికి కోవిడ్ టెస్ట్ `నెగిటీవ్‌` అని తేలాక‌.. ఆచార్య షూటింగ్ లో పాలుపంచుకోవాల‌ని చిరు ఫిక్స‌య్యాడు. కానీ..ఇప్పుడు ఇంకొంత విరామం తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. క‌రోనా. సెకండ్ వేవ్ జోరుగా ఉందిప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకే… చిరు షూటింగ్‌కి ఇంకొన్ని రోజులు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈలోగా.. చిరుతో సంబంధం లేని స‌న్నివేశాలన్నీ పూర్తి చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం డిసెంబ‌రు తొలి వారంలో కాజ‌ల్ `ఆచార్య‌` సెట్స్‌లోకి రావాలి. అయితే.. చిరు తాజా నిర్ణ‌యం తో.. కాజ‌ల్ ఎంట్రీ కూడా ఆల‌స్యం కానున్న‌ద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ బీజేపీ రథయాత్ర వాయిదా..!

అనుమతి ఇవ్వకపోతే బీజేపీ విశ్వరూపం చూస్తారని రథయాత్ర గురించి భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు... రథయాత్రను ఇప్పుడు వాయిదా వేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు దూసుకు రావడంతో.....

ద్వివేదీ మెడకు చుట్టుకుంటున్న ఓటర్ల జాబితా వివాదం..!

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పని చేసిన ప్రస్తుత పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. దీంతో తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది....

చైతన్య : జగన్‌ను ముంచేస్తున్న న్యాయసలహాదారులు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పళంగా.. తన న్యాయబృందం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. ఆయన న్యాయ సలహాదారులు.. ఇతర బృందం... తీసుకుంటున్న...
video

‘ఖిలాడీ’ ఎంట్రీ ఇచ్చేశాడు!

https://www.youtube.com/watch?v=uFi-NFk09xk&feature=youtu.be క్రాక్‌తో సూప‌ర్ హిట్టు కొట్టాడు ర‌వితేజ‌. అంత వ‌ర‌కు వ‌చ్చిన ఫ్లాపుల‌న్నీ... `క్రాక్‌`తో మ‌ర్చిపోయేలా చేశాడు. త‌న‌కు అచ్చొచ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించాడు. మ‌రోసారి... ఖిలాడీతో.. అలాంటి ప్ర‌య‌త్న‌మే చేయ‌బోతున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close