రామోజీఫిల్మ్‌సిటీకి మ‌రో బాహుబ‌లి

బాహుబ‌లి సినిమాతో లాభ‌పడిన వాళ్ల లిస్టులో రామోజీరావు ఒక‌రు. ఈ సినిమా షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే సాగింది. ఈ సినిమాకి రామోజీరావు తెర వెనుక పెట్టుబ‌డి పెట్టార‌ని, లాభాల్లో ఆయ‌న‌కు వాటా ద‌క్కింద‌ని అప్ప‌ట్లో చెప్పుకున్నారు కూడా. సినిమా అంతా ఫిల్మ్‌సిటీలోనే కాబ‌ట్టి, రామోజీరావుకి బాగా గిట్టుబాటు అయ్యింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే `ఈనాడు`లో ఈ సినిమాకి భారీ ప్ర‌చారం క‌ల్పించారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టే రామోజీ ఫిల్మ్‌సిటీకి మ‌రోటి ద‌క్కింది. అదే.. `ప్రాజెక్ట్ కె`.

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. నాగ అశ్విన్ ద‌ర్శ‌కుడు. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌ధారి. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే. కొన్ని స‌న్నివేశాలు మాత్రం విదేశాల్లో తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. అంటే దాదాపుగా 90 శాతం షూటింగ్ ఆర్.ఎఫ్‌.సీ లోనే. అంటే.. రామోజీ ఫిల్మ్‌సిటీకి మ‌రో బాహుబ‌లి ద‌క్కిన‌ట్టే. ఈ సినిమాకి సెట్ల‌న్నీ ఫిల్మ్‌సిటీలోనే వేయ‌బోతున్నారు. దాదాపు 50 శాతం స‌న్నివేశాలు సెట్లోనూ, మిగిలిన‌దంతా బ్లూ మేట్ లోనూ తెర‌కెక్కించ‌బోతున్నార‌ని టాక్‌. దీపికా ప‌దుకొణె క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆమె సెట్లోకి అడుగుపెట్ట‌బోతోంద‌ని స‌మాచారం. 2023లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“భళా తందనానా” అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు ...

టీచర్ ప్రసాద్ శ్రమను దోచేశారు !

రాజకీయాలంటే అంతే. ఎవడో కష్టపడిన దాన్ని తమ ఖాతాలో వేసుకోవడం. అధికారం ఉంది కదా అని పిలిచి.. తమ వల్లే వారికి ఆ సక్సెస్ దొరికిందని స్టేట్ మెంట్ ఇప్పించుకోవడం. అలా ఇవ్వకపోతే...

ఢిల్లీ నుంచి కేసీఆర్ దేశవ్యాప్త టూర్స్ – ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్ !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో మేధావులు, మీడియా ప్రతినిధులతో మేథోమథనం జరుపుతారు. ఆ...

ఎడిటర్స్ కామెంట్ : జ్ఞానవాపి మరో బాబ్రీ !

" జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడింది.. అక్కడ ఉన్న గుడిని కూలగొట్టి ముస్లిం రాజు ముసీదు నిర్మించారు. ఇప్పుడు మళ్లీ గుడిని పునరుద్ధరించాలి" అన్న డిమాండ్ బయలుదేరింది. వెంటనే ఒవైసీ లాంటి వాళ్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close