ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పెట్టుకుంటే ఏమ‌వుతుందో ప్ర‌కాష్ రాజ్‌కి తొంద‌ర‌గానే అర్థ‌మైంది. నిన్న ప్ర‌కాష్ రాజ్ మాట్లాడిన మాట‌ల‌కు.. ఇప్పుడు కౌంట‌ర్లు వ‌స్తున్నాయి. తొలిగా బాణాన్ని సంధించింది.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబునే.

“రాజ‌కీయాల్లో అనేక‌సార్లు నిర్ణ‌యాలు మారుతూ ఉంటాయి. ఆ నిర్ణ‌యాల వెనుక ఉద్దేశ్యం ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం అయితే.. విమ‌ర్శించే అవ‌స‌రం లేదు. జ‌న‌సేన బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెనుక విస్త్రృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాలున్నాయి“ అంటూ పేర్కొన్న నాగ‌బాబు.. పనిలో ప‌నిగా ప్ర‌కాష్ రాజ్ పై త‌న ప్ర‌తాపం చూపించేశారు.

“ప్ర‌తీ ప‌నికి మాలిన‌వాడూ.. విమ‌ర్శిస్తున్నాడు. మిస్ట‌ర్ ప్ర‌కాష్ రాజ్‌.. నీ రాజ‌కీయ డొల్ల‌త‌నం ఏమిటో.. బీజేపీ లీడ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి డిబేట్ లోనే అర్థ‌మైంది. నిన్ను తొక్కి పెట్టి నార తీస్తుంటే, మాట్లాడ‌లేక త‌డ‌బ‌డ‌డం ఇంకా గుర్తుంది“ అంటూ ప్ర‌కాష్ రాజ్ పై విమ‌ర్శ‌నా బాణాలు వ‌దిలాడు. నిర్మాత‌ల్ని డ‌బ్బుల కోసం హింసించి, ఇచ్చిన డేట్స్ కాన్సిల్ చేసి, కాల్చుకుతిన్నావ్‌.. అంటూ.. తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డాడు. ముందు ఓ మంచి మ‌నిషిగా మారి, అప్పుడు విమ‌ర్శించు అని హిత‌వు ప‌లికాడు.

మొత్తానికి ప్ర‌కాష్ రాజ్ కి ప‌వ‌న్ సెగ త‌గ‌ల‌డం మొద‌లైంది. అయితే.. ప్ర‌కాష్ రాజ్ ఊరుకునే కూర్చునే ర‌కం కాదు. త‌ను కూడా కౌంట‌ర్లు ఇవ్వ‌డం మొద‌లెడ‌తాడు. దాంతో.. ఇది కాస్త చినికి చినికి గాలివాన గా మారే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ప‌వ‌న్ ని ఏమ‌న్నా.. నాగ‌బాబు విరుచుకుప‌డిపోవ‌డం మామూలైపోయింది. నాగ‌బాబు ఎంట్రీతో చిన్న విష‌యాలే పెద్ద‌వి అవుతున్నాయ‌ని కొంత‌మంది మెగా అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఫీల‌వుతున్నారు. మరి కొంత‌మందైతే.. ఇలా ఎవ‌రో ఒక‌రు కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోతే.. కొన్ని నోళ్లు ఆగ‌వు అనుకుంటున్నారు. ఏది ఏమైనా… ఇప్పుడు టాలీవుడ్ లో ప‌వ‌న్ వెర్సెస్ ప్ర‌కాష్ రాజ్‌.. ఎపిసోడ్‌కి అజ్యం పోయ‌గ‌లిగాడు నాగ‌బాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు...

చంపడానికి కూడా సిద్ధమంటున్న ఉద్యోగ సంఘాల రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల "సామాజిక" భక్తి, విధేయత చంపుతాం అనే హెచ్చరికల వరకూ వెళ్తోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగ సంఘ నేతలు.. అదే పనిగా మీడియా...

దీదీ కాన్సెప్ట్ : దేశానికి నాలుగు రాజధానులు..!

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీని ప్రకారం మరి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఎన్ని రాజధానులు...

బిడెన్ ప్యాకేజీ : ఒక్కో అమెరికన్ పౌరునికి రూ. లక్షన్నర..!

నల్లధనాన్నంతా వెనక్కి తెస్తాం.. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో పదిహేను లక్షలేస్తాం అని బీజేపీ చెప్పింది కానీ.. ఇప్పటి వరకూ వేసింది లేదు.. కానీ నల్లధనం మొత్తం వెనక్కి తెచ్చామని కూడా చెప్పారు. దీంతో...

HOT NEWS

[X] Close
[X] Close