ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు క‌నిపించ‌నున్నారు. ఆ పాత్ర‌లు స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌ల‌కు ద‌క్క‌నుంద‌ని టాక్‌.

నిజానికి త‌నికెళ్ల భ‌ర‌ణి.. ఓ ప్ర‌యోగాత్మ‌క క‌థ ని రాసుకున్నార్ట‌. అయితే దానికి కొన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులూ జోడించాల‌ని భావించ‌డంతో – ఈ ముగ్గురు హీరోయిన్ల‌కూ చోటు క‌ల్పించార‌ని తెలుస్తోంది. స‌మంత‌, శ్రియ‌ల‌వి దాదాపుగా అతిథి పాత్ర‌లే. ర‌మ్య‌కృష్ణ పాత్ర మాత్రం పూర్తి నిడివితో సాగ‌బోతోంద‌ని టాక్‌. 2021 లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కుతుంది. 2021 చివ‌ర్లో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఓ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానిజాలేమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close