ప‌ర‌శురామ్ ని వెయిటింగ్ లిస్టులో పెట్టేసిన చైతూ

నాగ‌చైత‌న్య – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓసినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. దీనికి `నాగేశ్వ‌ర‌రావు` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. స‌ర్కారువారి పాట త‌ర‌వాత ప‌ర‌శురామ్ చేయ‌బోయే సినిమా ఇదే. అయితే.. ఇది ఇప్ప‌ట్లో సెట్స్‌పైకి వెళ్లేలా క‌నిపిచండం లేదు. ఎందుకంటే… నాగ‌చైతన్య దృష్టి ఇప్పుడు వెంక‌ట్ ప్ర‌భు క‌థ‌పై ఉంది. వెంక‌ట్ ప్ర‌భుతో ఓ సినిమా చేయ‌డానికి చైతూ అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో యువ ద‌ర్శ‌కుడి క‌థ‌కూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. వీటిలో ఒక‌టి అయ్యాకే… ప‌ర‌శురామ్ తో సినిమా చేస్తానంటున్నాడ‌ట చైతూ. ఇలా ప‌ర‌శురామ్ ని దాటేయ‌డానికి కూడా ఓ రీజ‌న్ ఉంది.

స‌ర్కారు వారి పాట‌కు ముందే ఈ కాంబో ఓకే అయ్యింది. ఎప్పుడైతే.. ప‌ర‌శురామ్ లైన్‌లోకి మ‌హేష్ వ‌చ్చాడో.. అప్పుడు.. `మీ త‌ర‌వాత చేస్తా.. ముందు మ‌హేష్ తో సినిమా పూర్తి చేసుకొస్తా` అని చైతూకి చెప్పి వ‌చ్చేశాడు ప‌ర‌శురామ్. అప్పుడు త‌న‌ని వెయిటింగ్ లో పెట్టినందుకు.. చైతూ ఇలా స్వీట్ రివైంజ్ తీర్చుకొంటున్నాడ‌న్న‌మాట‌. వెంక‌ట్ ప్ర‌భుతో సినిమా మొద‌లెడితే క‌నీసం 7-8 నెల‌లు ఆ ప్రాజెక్టుతోనే ఉండాలి. అప్ప‌టి వ‌ర‌కూ ప‌ర‌శురామ్ వెయిట్ చేయాల్సిందే. లేదంటే మ‌రో హీరోతో డీల్ ఓకే చేసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకమాండ్ ఫైనల్ వార్నింగ్ !

పార్టీలో ఉంటే ఉండే పోతే పో అని చాలా ఘాటుగా చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. సున్నితమైన భాషలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపుతోంది....

నిజం తెలిస్తే రాయండి.. లేదంటే మూసుకోండి: దిల్ రాజు

''వ్యూస్ కోసం క్లిక్స్ కోసం తప్పుడు రాతలు రాయొద్దు. వాస్తవాలు తెలిస్తే రాయండి. లేకపోతే మూసుకోండి' అని ఘాటుగా వ్యాఖ్యానించారు నిర్మాత దిల్ రాజు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో పాల్గొన్న...

ఫిరాయింపు ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిన జగన్ !

ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్న తర్వాత తనను దూరం పెట్టడం.. తనకు వ్యతిరేకంగా ఇతరుల్ని ప్రోత్సహించడం.....

రంగీలాలో చిరు – ర‌జ‌నీ – శ్రీ‌దేవి..?

రంగీలా... రాంగోపాల్ వ‌ర్మ త‌డాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళ‌ని ఈ సినిమా సూప‌ర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ క‌థ చిరంజీవి, ర‌జ‌నీ కాంత్, శ్రీ‌దేవిల‌తో చేయాల్సింద‌ట‌....

HOT NEWS

css.php
[X] Close
[X] Close