అల్లూరి టీజ‌ర్‌: విప్ల‌వానికి నాంది… చైత‌న్యానికి పునాది

ముందు నుంచీ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నాడు శ్రీ‌విష్ణు. ఆ దారిలో త‌న‌కు విజ‌యాలూ ద‌క్కాయి. కెరీర్‌లో తొలిసారి ఓ పోలీస్ పాత్ర పోషించాడు. అదే `అల్లూరి`. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌. ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తారు. ఇప్పుడు టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

”ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్‌.. పోలీస్ బ‌య‌ల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజ‌ర్ మొద‌లైంది. టీజ‌ర్‌లో చాలా షాట్లు ప‌డ్డాయి. అయితే ఏ ఒక్క‌రి క్యారెక్ట‌రు పూర్తిగా రివీల్ చేయ‌లేదు. చైత‌న్యానికి నాంది, విప్ల‌వానికి పునాది.. నిజాయ‌తీకి మారు పేరు.. అంటూ.. ‘అల్లూరి’ పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు. పోలీస్ గెట‌ప్ లో శ్రీ‌విష్ణు లుక్ స్ట‌న్నింగ్ గా ఉంది. 1990 బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగిన క‌థ‌లా అనిపిస్తోంది. న‌క్స‌ల్ ఉద్య‌మాన్నీ ట‌చ్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ”అల్లూరి సీతారామ‌రాజు, స‌బ్ ఇన‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్” అంటూ ప‌వ‌ర్ ఫుల్ గా డైలాగ్ చెప్ప‌డం, చుట్టూ ఉన్న ఇర‌వై మంది న‌క్స‌లైట్లు శ్రీ‌విష్ణుకి గ‌న్నులు గురి పెట్ట‌డంతో టీజ‌ర్ పూర్త‌య్యింది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రాజ్ తోట కెమెరా ప‌నిత‌నం నీట్ గా ఉన్నాయి. పోలీస్ గెట‌ప్‌, మంచి క్యారెక్ట‌రైజేష‌న్ తో పాటుగా ఈ క‌థ‌లో థ్రిల్లింగ్ అంశాలూ ఉండి ఉంటే.. క‌చ్చితంగా శ్రీ‌విష్ణు ఖాతాలో మ‌రో హిట్ ప‌డుతుంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.