ఇన్‌సైడ్ న్యూస్‌: స‌మంత స్టాఫ్‌పై అలిగిన చైతూ?!

నాగ‌చైత‌న్య – స‌మంత.. ఇద్ద‌రూ ఒక్క‌టే ఇప్పుడు. వాళ్ల మ‌ధ్య ఈగోల గోల ఉండ‌దు. కానీ.. వాళ్ల ద‌గ్గ‌ర ప‌నిచేసే స్టాఫ్‌కి ఉండే అవ‌కాశాలున్నాయి క‌దా? ఇప్పుడు అదే జ‌రిగింది. స‌మంత కోసం ప‌నిచేసేవాళ్ల‌కు స‌మంత గొప్ప‌. చైతూ స్టాఫ్‌కి చైతూనే గొప్ప‌. వాళ్ల మ‌ధ్య ఈగో క్లాష్ స‌మంత‌, చైతూల‌కు త‌ల‌నొప్పి తెచ్చేలా మారింది.

వివ‌రాల్లోకి వెళ్తే… స‌మంత‌కు, నాగ‌చైత‌న్య‌కు ప్ర‌త్యేకంగా స్టాఫ్ ఉన్నారు. డ్ర‌స్సింగ్‌, హెయిర్ స్టైలింగ్‌, మేక‌ప్ ఇలా.. ఒకొక్క ప‌నికీ వేర్వేరుగా కొంత‌మందిని నియ‌మించుకున్నారు. ప్ర‌తీ హీరోకీ ఇలా వ్య‌క్తిగ‌త సిబ్బంది ఉండ‌డం మామూలే. స‌మంత త‌న స్టాఫ్‌ని చాలా బాగా చూసుకుంటుంది. ఎంత‌లా అంటే… వాళ్ల పుట్టిన రోజుకు ఖ‌రీదైన బ‌హుమానాలు ఇవ్వ‌డం, సినిమా హిట్ట‌యితే పార్టీలు, న‌జ‌రానాలు ప్ర‌క‌టించ‌డం లాంటివి చేస్తుంటుంది. దాంతో.. స‌మంత అంటే వాళ్లంతా బాగా ఎటాచ్‌మెంట్ పెంచేసుకున్నారు.

ఈమ‌ధ్య మ‌జిలీ సినిమా విడుద‌లైంది. బాగా ఆడింది కూడా. ఈ సినిమాలో స‌మంత బాగా చేసిందా? నాగ చైత‌న్య బాగా చేశాడా? అనే టాపిక్ స‌మంత‌, చైతూ స్టాఫ్ మ‌ధ్య న‌డిచింద‌ట‌. ఈ విష‌యంలో రెండు గ్రూపుల మ‌ధ్య వాదోప‌వాదాలు బాగా న‌డిచాయి. ఈ విష‌యం చైతూకీ తెలిసిపోయింది. ఓ సంద‌ర్భంలో `నేను బాగా చేశానా? స‌మంత బాగా చేసిందా?` అని డైరెక్టుగా స‌మంత స్టాఫ్‌నే చైతూ అడిగాడ‌ని స‌మాచారం. స‌మంత స్టాఫ్ క‌దా? అందుకే వాళ్లంతా ‘స‌మంత మేడ‌మే బాగా చేసింది’ అనేస‌రికి.. చైతూ హ‌ర్ట‌య్యాడ‌ని తెలిసింది. ఒక‌ర్న‌యితే.. ‘నువ్విక ప‌నిలోకి రాకు’ అని డైరెక్టుగా చెప్పేశాడ‌ట‌. దాంతో స‌మంత రంగంలోకి దిగి ప‌రిస్థితిని చ‌క్క‌బెట్టింద‌ట‌. భార్యాభ‌ర్త‌లుగా మారిన హీరో, హీరోయిన్లు క‌ల‌సి క‌ట్టుగా సినిమా చేస్తే.. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘జ‌ల్లిక‌ట్టు’

భార‌తీయ సినిమా రంగంలో మ‌ల‌యాళం సినిమా ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంటుంది. వాళ్ల ద‌గ్గ‌ర బ‌డ్జెట్లు లేక‌పోవొచ్చు. కానీ.. ఆలోచ‌న‌లున్నాయి. ఎవ‌రికీ త‌ట్ట‌ని ఆలోచ‌న‌లు, త‌ట్టినా.. చెప్ప‌లేని క‌థ‌లు వాళ్లు ధైర్యంగా చెప్పేస్తారు....

కేంద్రంపై న్యాయపోరాటానికి కేసీఆర్‌కు “కాగ్” అస్త్రం..!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న భావనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ న్యాయపోరాటం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్‌కు...

హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ స్పాట్ కేబుల్ బ్రిడ్జి..!

హైదరాబాద్ మరింత ఆకర్షణీయంగా అయింది. మంత్రి కేటీఆర్ తన ఆలోచనకు నిర్మాణ రూపమిచ్చారు. చకచకా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకు వచ్చారు. అదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. దూరం నుంచే...

ఏపీలో మద్యం బ్రాండ్ల కోసం మాల్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ప్రతీ ఏడాది ఇరవై శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. గత ఏడాదిలోనే మొదటి సారి ఇరవై శాతం.. తర్వాత లాక్...

HOT NEWS

[X] Close
[X] Close