సిల్లీ కేసులు వంద కాదు.. వెయ్యి పెట్టుకోండి : శివాజీ

నాలుగు రోజుల తర్వాత తెలంగాణ పోలీసుల ముందు హాజరవుతానని… శివాజీ.. ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 యాజమాన్య బదిలీ వివాదం నేపధ్యంలో.. రవిప్రకాష్‌తో పాటు.. శివాజీపైనా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేశారు. నోటీసులు జారీ చేసినా… పోలీసుల ఎదుట హాజరు కాకపోవడంతో.. తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. నాలుగు బృందాలు.. రవిప్రకాష్‌తో పాటు.. శివాజీ కోసం వెదుకుతున్నాయని తెలంగాణ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో శివాజీ ఓ వీడియో విడుదల చేసి.. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రవిప్రకాష్‌తో జరిగిన ఒప్పందంపై కౌశిక్ రావు ఫిర్యాదు ఏమిటి..? : శివాజీ

టీవీ9 యాజమాన్య బదిలీ వివాదంలో అసలు తన ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం కౌశిక్ రావుకు ఏముందని.. శివాజీ ప్రశ్నిస్తున్నారు. రవిప్రకాష్‌కు చెందిన టీవీ9 షేర్లను తాను కొనుగోలు చేశానని.. అది తమ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం అని స్పష్టం చేశారు. తమ మధ్య గత ఏడాది ఫిబ్రవరిలోనే ఒప్పందం జరిగిన మాట వాస్తవమన్నారు. అయితే… షేర్ల బదిలీ జరగలేదని.. యాజమాన్యం మారిన కారణంగా.. మళ్లీ ఈ ఏడాది షేర్ల బదిలీ గురించి అడిగానని.. శివాజీ స్పష్టం చేశారు. రెండూ కరెక్టేనన్నారు. దీనిపై.. తమ మధ్య సివిల్ వివాదం కోర్టులో ఉందని.. దానిపై కౌశిక్ రావు ఫిర్యాదు చేయడం… తెలంగాణ పోలీసులు దాన్నో క్రిమినల్ కేసుగా మార్చడం ఏమిటని శివాజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రవిప్రకాష్‌, నాకు మధ్య జరిగిన షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ..అని అనవసరంగా క్రిమినల్ పంచాయతీ చేశారని శివాజీ వీడియోలో మండిపడ్డారు.

ఇలాంటి సిల్లీ కేసులు వెయ్యి పెట్టుకోండి..: శివాజీ

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందంలో జోక్యం చేసుకోడానికి కౌశిక్‌రావు ఎవరనేది శివాజీ వీడియోలో సంధించిన ప్రశ్న. కౌశిక్‌రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు తన ఇంటిపై పడ్డారని.. సోదాలు చేసి ఏమీ దొరకలేదని వెళ్లిపోయారన్నారు. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తనపై పగ పట్టిందని శివాజీ ఆరోపిస్తున్నారు. తాను సెటిలర్‌నని, స్థానబలం లేదని అనుకుంటున్నారని … కేసులు వంద కాదు, వెయ్యి పెట్టుకోండి అని చాలెంజ్ చేశారు. ఇవి సిల్లీ కేసులని తేల్చారు. టీవీ9ను కొనుగోలు చేసి రామేశ్వరరావు తనకు బాగా తెలుసని.. ఆయన ఆయన పిలిచి అడిగితే అన్నీ చెప్పేవాడినని శివాజీ వీడియోలో చెప్పుకొచ్చారు. నిజాయితీగా బయటికి వస్తాను.. నాలుగు రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్తానని శివాజీ ప్రకటించారు.

సెటిలర్‌నని.. స్థాన బలిమి లేదనే తెలంగాణ సర్కార్ వేధింపులు : శివాజీ

తాను ఆజ్ఞాతంలో లేనని ప్రజల మధ్యేనని… శివాజీ చెబుతున్నారు. మూడు రోజుల కిందట తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నానన్నారు. నాకు వడదెబ్బ తగిలి విశ్రాంతి తీసుకుంటున్నానన్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా సోషల్‌మీడియా పరారీలో ఉన్నానని ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని.. అవి వాళ్లకే తగులుతాయని శాపనార్థాలు పెట్టారు. రవిప్రకాష్, శివాజీలను అరెస్ట్ చేయడానికి నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లుగా.. తెలంగాణ పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చిన నేపధ్యంలో శివాజీ వీడియో విడుదల చేశారు. ఇందులో గుండు చేయించుకుని కనిపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close