నాగ‌చైత‌న్య వెబ్ సిరీస్ ఏమైంది..?

నాగ‌చైత‌న్య కూడా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లోకి అడుగుపెట్టాడు. విక్ర‌మ్ కె.కుమార్ తో ఓ వెబ్ సిరీస్ చేశాడు. అదే. దూత‌`. విక్ర‌మ్ తో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్న‌ప్పుడే.. స‌మాంత‌రంగా ఈ వెబ్ సిరీస్‌నీ ప‌ట్టాలెక్కించాడు. షూటింగ్ కూడా ఎప్పుడో పూర్త‌యిపోయింది. కానీ ఇంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఈ వెబ్ సిరీస్‌… ఆమేజాన్‌కి ఎక్స్‌క్లూజీవ్‌. వాళ్లు… త‌మ కంటెంట్ విష‌యంలో చాలా ప‌ర్‌ఫెక్ట్స్‌గా ఉంటారు. ఏమాత్రం… డౌట్ ఉన్నా, రీషూట్లు, డిస్క‌ర్ష‌న్లు, రీ ఎడిటింగులూ త‌ప్ప‌వు. ప్ర‌స్తుతం `దూత‌`కీ అదే జ‌రుగుతోందని స‌మాచారం. పైగా అటు నాగ‌చైత‌న్య గానీ, ఇటు విక్ర‌మ్ గానీ… ఫామ్ లో లేరు. ఇప్పుడు ఈ దూత‌నిరిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌… పెద్దగా క్రేజ్ ఉండ‌ద‌ని అమేజాన్ అభిప్రాయం. చైతూ సినిమా ఏదైనా హిట్ట‌యినా, లేదా మంచి బ‌జ్‌లో ఉన్నా దూత‌ని రిలీజ్ చేద్దామ‌నుకొంటున్నారు. పైగా.. అమేజాన్ ద‌గ్గ‌ర కంటెంట్ కి కొద‌వ లేదు. అందుకే `దూత‌`ని హోల్ట్‌లో పెట్టారు. కాక‌పోతే… `దూత 2` స్క్రిప్టు త‌యారు చేయ‌మ‌ని.. విక్ర‌మ్ కె.కుమార్‌ని అమేజాన్ సంప్ర‌దించింద‌ని తెలుస్తోంది. సో… దీనికి సెకండ్ సీజ‌న్ కూడా ఉంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : వైసీపీ నేతలే కావొచ్చు కానీ మీరు మనుషులయ్యా.. గుర్తుంచుకోండి !

గుండెపోటు వచ్చిన ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడిన వీడియో చూసిన తరవాత ఎవరికైనా మనం మనుషులం అనే సంగతిని మార్చిపోతున్నామా అని...

ఏపీ ఆలయాల్లో దేవుడ్నే లెక్క చేయడం లేదంటున్న రమణదీక్షితలు !

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఏపీలో ఆలయాల పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి...

పెగాసస్ నిఘా పెట్టారని కనిపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే !

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై ప్రభుత్వం పెగాసస్ ప్రయోగించిందని ఆరోపిస్తున్నారు తన ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయని తనపై నిఘా కోసమే ప్రత్యేకంగా ముగ్గురు అధికారుల్ని పెట్టారని ఆయన...

ఢిల్లీ పిలవట్లేదు.. తాడేపల్లిలో ఉండాలనిపించడం లేదు !

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్జంట్ గా ఢిల్లీ వెళ్లి కొన్ని పనులు చక్క బెట్టాలనుకుంటున్నారు. కానీ ఢిల్లీ నుంచి పిలుపు రావడం లేదు. ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లకపోతే చాలా సమస్యలు వస్తాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close