టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తనకు తెలియదని.. పేపర్లలో చూసి మాత్రమే తెలుసుకున్నానని నందమూరి బాలకృష్ణ మీడియాతో అన్నారు. అంతటితో వదిలేస్తే పోయేది.. కానీ.. వారందరూ తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ మాటలు.. చిచ్చు పెట్టేసినంత పని చేస్తున్నాయి. మా అధ్యక్షుడు నరేష్‌కు కూడా.. తనను పిలవడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ.. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించడానికి ఆసక్తి కనబర్చలేదు.

ఈ వ్యాఖ్యలపై తలసాని స్పందించారు. షూటింగ్‌లు మళ్లీ ప్రారంభించే అంశంపై యాక్టివ్‌గా సంప్రదిస్తున్న వారితోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. కావాలంటే అందరితో మాట్లాడతానన్నారు. నిర్మాతల మండలి బాలకృష్ణకు కూడా చెప్పాల్సి ఉందని అభిప్రాయపడింది. ఆ వ్యవహారం అలా ఉండగానే.. నాగబాబు ఆవేశపడిపోయారు. బాలకృష్ణపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. వీడియో విడుదల చేశారు. బాలకృష్ణ టాలీవుడ్‌కు… తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని.. తాను వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తున్నానని కూడా.. చెప్పుకొచ్చారు. బాలకృష్ణ భూములు పంచుకోవడానికి కలిశారా అని చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

ఇటీవలి కాలంలో నాగబాబు వివాదాస్పద కామెంట్లు చేస్తూ.. వార్తల్లోకి ఎక్కే ప్యరయత్నం చేస్తున్నారు. సంబంధం లేకపోయినా గాడ్సేను పొడగడమే కాదు.. గాంధీని కించ పరిచే ప్రయత్నాలు చేశారు. తీవ్రమైన విమర్శలు వస్తే.. అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. తద్వారా వివాదాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తన టెంపర్‌ను చూపించడం ఈ తరహా పబ్లిసిటీ కోసమేనంటున్నారు. స్పందించాల్సిన వాళ్లు స్పందిస్తారు కానీ.. నాగబాబుకేం సంబంధం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

HOT NEWS

[X] Close
[X] Close