బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు దంచి కొడుతూ, బాల‌య్య‌కు ఇండైరెక్టుగా వార్నింగులు లాంటివి ఇస్తూ… నాగ‌బాబు ఓ వీడియో వ‌ద‌ల‌డంతో అగ్నిలో ఆజ్ఞం పోసిన‌ట్టైంది. నాగ‌బాబు ఎంట్రీతో.. ఈ వివాదం ఇంకాస్త ముదిరింది.

అయితే నాగ‌బాబు కూడా వెంట‌నే న‌ష్ట‌నివార‌ణ‌లో దిగిపోయాడు. తాజా వీడియోల త‌ర‌వాత ఓ మీడియా ఛాన‌ల్ తో మాట్లాడుతూ బాల‌య్య‌తో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి శత్రుత్వం లేద‌ని, త‌న‌పై ద్వేషంతోనో, కోపంతోనో ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, ప‌రిశ్రమ వ్య‌క్తిగా, పరిశ్ర‌మ‌పై ప్రేమ‌తోనే స్పందించాన‌ని పేర్కున్నారు. ఇది వ‌ర‌కు బాల‌య్య‌ని ఓ హాస్య‌న‌టుడిగా అభివ‌ర్ణించాడు నాగ‌బాబు. దానిపై కూడా స్పందించాడు. హాస్య‌న‌టుడు అంటే త‌ప్పేంటి? హాస్యం కూడా ఓ న‌ట‌నే క‌దా.. అది ఓ కాంప్లిమెంట్ అంటూ స‌వ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. అయితే “భూములు పంచుకోవడం” అని బాల‌య్య వ్యాఖ్యానించ‌డం మాత్రం హ‌ర్షించ‌ద‌గిన‌ది కాద‌ని చెప్పుకొచ్చాడు. బాల‌య్య‌ని ఎందుకు పిల‌వ‌లేదో త‌న‌కు తెలీద‌ని, ఒక‌వేళ పిల‌వ‌క‌పోతే… సంబంధిత వ్య‌క్తుల్ని బాల‌య్య ప్ర‌శ్నించొచ్చ‌ని, అయితే ఇలాంటి ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్టు కాద‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close