ఆ రీమేక్‌పై పెద‌వి విప్పిన నాగ్‌

`మ‌న్మ‌థుడు 2` త‌ర‌వాత నాగార్జున మ‌రో సినిమా చేయ‌లేదు. కాక‌పోతే చేతిలో స్క్రిప్టులైతే ఉన్నాయి. అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించిన `రైడ్‌`ని నాగ్ రీమేక్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై నాగార్జున స్పందించారు. ఆ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, కాక‌పోతే.. స్క్రిప్టు పూర్తి చేశాక క‌ల‌వ‌మ‌న్నానని ఆయ‌న చెప్పారు. రైడ్ సినిమా నాగ్ ఇది వ‌ర‌కే చూశార్ట‌. ఆ సినిమా బాగా న‌చ్చింద‌ని, స్క్రిప్టు ప‌క్కాగా కుదిరితే చేయ‌డానికి అభ్యంత‌రం లేద‌ని క్లారిటీగా చెబుతున్నారు. రైడ్ ప్రాజెక్టుకి ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు ఖాయం కాలేదు. తెలుగులో స్క్రిప్టు పూర్త‌వ్వ‌డానికి స‌మ‌యం ప‌ట్టేట్టు క‌నిపిస్తోంది. అందుకే అంత‌కంటే ముందు వంశీ పైడిప‌ల్లి శిష్యుడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. డిసెంబ‌రు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాతే… `రైడ్‌` రీమేక్ ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close